"పంజా భీమరాజ్యచ కృష్ణవేణీ బృహన్నదీ|
మహాపహారిణీ యత్ర స త లోక విశృతా||"
"భీమాబనీ చంద్రబాగా
విఠ్ఠలచరణ్ కీ గంగా"
చంద్రభాగ (భీమానది) నదీ తీరంలో బాలూ అనే విశాల మైదాన ప్రాంతంలో లక్షలాది భక్తులు (వార్కరీ) తల్లీనులై నాణ్యం చేస్తూ కనిపిస్తారు. పంఢరపురంలో ఈ దృశ్యం మనకు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. భీమామయ్యాను గంగా-భాగీరథీ సమానురాలిగా భావించి అందులో స్నానం చేస్తారు. పంఢరపురంలో భీమానది చంద్రభాగగా మారింది. ఎందుకంటే పంఢరపురం వద్ద భీమానది చంద్రకోర్ ఆకారంలో మారిపోతుంది.
గంగమ్మ తల్లి శంకరుడి జటాజూటంలోంచి స్వర్గం మీదుగా నేరుగా పృధ్వి పైకి వచ్చింది. భూమిపై శంకరుని చెమట నీటిగా ప్రవహించింది. భీమానది యొక్క జన్మస్తానం శ్రీభీమశంకరం. ఇది పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. పూణెజిల్లాలో రాజ్ గురు నగరం (ఖేడ్) తాసిల్ లో ఘోడేగాంవ్ ుందుగల సహ్యాద్రి పర్వత శ్రేణిలో గల భవరగిరి, రథాచలం మరియు భీమ శంకరం యొక్క పర్వతాలు . వీటిలో భీమశంకర పర్వతంపై భీమశంకర పవిత్రస్థానం ఉంది. ఇక్కడ బాగా ఈదురు గాలి వీస్తున్నప్పటికీ ఇక్కడి చలి కొరికేస్తున్నట్టు ఉండదు.
ఇక్కడి ఘనమైన అడవులలో సింహాలున్నాయంటారు. ఇతర వన్యప్రాణులు కూడా ఉన్నాయి. ఈఅడవులు వనఔషధాలకు నిధిలు. భీమశంకర తీర్థయాత్ర ఇప్పుడు చాలా సులభతరం అయింది. తీర్ధస్థానం చేరుకోవడానికి నేరుగానూ, సౌకర్యంగానూ రోడ్లున్నాయి. కేవలం కోకణ్ ప్రదేశం నుంచి ఇక్కడి రావటానికి కొండారి కావటాన్న కొద్ది పాటి కష్టం ఉంది.
చాలా ఏళ్లక్రితం ఇక్కడి అడవులు శాకినీ మరియు డాకినీలకు నివాసస్థానంగా ఉండేవి. ఈ ప్రదేశంలో బస్తీలు చాలా తక్కువగా ఉండేవి. కానీ శివరాత్రి నాడు మాత్రం తండోపతండాలుగా ప్రజలు రావడం వల్ల సందడిగా ఉండేది. ఆ సమయానికి భక్తులు వచ్చి శ్రీ భీమ శంకరుణ్ణి దర్శించుకుని వెళ్లిపోతురు. ప్రస్తుతం, ఈ పవిత్ర స్థానంలో చాలా సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రభుత్వ వారి గెస్ట్ హౌస్ కూడా ఉంది. రాత్రి పూట అడవి నుంచి సింహాలు జ్యోతిర్లింగ దర్శనార్ధం వచ్చిపోతుంటాయని అంటారు. జ్యోతిర్లింగాన్ని గురించిన వివిధ కథలు ఇవి.
ప్రాచీన కాలంలో త్రిపురాసుడనే రాక్షసుడు చాలా మందాంధుడై మెలగసాగేడు. స్వర్గం, నరకం మరియు పాతాళ లోకాలలో చాలా కల్లోలం చెలరేగింది. దేవగణాలవారందర భయభీతులైనారు. చివరికి పరమేశ్వుడే స్వయంగా విశాల భీమాకాయధారణ చేశాడు. ఆయన రుద్రావతారం చూసి త్రిపురాసురుడు భయకంపితుడైనాడు. ఇద్దరి నడుమా చాలా రోజులపాటు భీకర యుద్ధం జరిగింది. చివరికి శంకరుడు ఆ దుష్టుడిని వధించి, త్రిభువనాలకూ సంకట విముక్తి కలిగించాడు. ఆ సమయంలో విశాలకాయుడైన మహాదేవునికి చాలా అలసట కలిగింది. విశ్రమించటానికై సహ్యాద్రి పర్వతాలలోని ఈ ఎత్తయిన శిఖరాలపైకి వచ్చాడు శివుడు. ఆయన శరీరం నుంచి చెమట సహస్రధారలుగా ప్రవహించింది. ఆధారలన్నీ ఒక ప్రవాహంగా ఒక కొలనుగా మారాయి. అక్కడి నుంచి పుట్టిన నది పేరు భీమ. నేటికీ భీమానది పుట్టి ప్రదేశాన్ని చూడవచ్చు. భక్తులు అప్పుడు ఆ భీమకాయ రుద్రుడిని ప్రార్థించారు. "సాధు, సజ్జనులను రక్షించేందుకై మీరు ఇక్కడే ఎప్పటికీ నివసించండి దేవా" అని వేడుకున్నారు. భోలానాథుడు భక్తులను కటాక్షించి, జ్యోతిర్లింగ రూపుడై అక్కడే సదా నివసించసాగేడు.
కుంభకర్ణుడు మరియు కర్కటీలకు పుట్టిన భీమ నామధేయుడైన ఒక వీరుడైన రాక్షసుడు ఉండేవాడు. వాడు అన్ని ప్రాణులనూ, కష్టాలపాలు చేస్తూ ధర్మాన్ని నష్టపరుస్తూ వారిని వేధించసాగాడు. తన తండ్రి ఎవరని, అతడు ఎక్కడుంటాడో తెలియజేయమని తన తల్లిని ఒకసారి అడిగాడు. ఆమె ఇలా చెప్పింది. " నీ తండ్రి లంకాపతి రావణాసురుని తమ్ముడు అయిన కుంభకర్ణుడు. రామునిచే వధింపబడ్డాడు. నేనూ ఇంతవరకూ లంక చూడలేదు. నీ తండ్రిని నేను అక్కడి పర్వత సీమలో కలుసుకున్నాను. నీవు పుట్టాక ఇక్కడే నివసిస్తున్నాను. నా భర్త మరణం తర్వాత నాకు పుట్టినిల్లే శరణ్యం అయింది. నా తల్లతండ్రులైన పుష్కసి, కర్కటులు ఒకసారి అగస్త్య మహామునిని భక్షించటానికై వెడితే, అతడు తన తపోబలంతో వారిని భస్మం చేసేశాడు" అని చెప్పింది.
ఈ కథ వినగానే ఆరాక్షసుడు శ్రీహరి సమేతంగా అందరు దేవతలనూ మట్టుబెట్టి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. వెంటనే కఠోర తపస్సు చేసి బ్రహ్మను మెప్పించాడు. అపారమయిన బలశాలి కావాలనే వరాన్ని పొంది, ఈ బలసహాయంతో విష్ణవుతో సహా అందరు దేవతలనూ గెలిచి తన వశం చేసుకున్నాడు. ఆ తరువాత మహాశివభక్తుడైన కామరూపేశ్వరుని సర్వస్వం హరించి, అతగాడిని కారాగారం పాలు చేశాడు. కామరూపేశ్వరుడు కారాగారంలో కూడా విధివిధానంగా, నియమానుసారం శివపూజ గావించనారంభించాడు. అతడి పత్ని కూడా శివారాధన నిరతం చేస్తూ వచ్చింది.
ఇటు వైపు విష్ణు, బ్రహ్మాది దేవతలు కలిసి శంకరభగవానుని సేవలో నిమగ్నమయ్యారు. వారు ఈ దుష్టదైత్యుని బారి నుండి తమను రక్షించమని ప్రార్ధించసాగారు. శివుడు వారితో ధైర్యవచనాలు పలికి వారిని సమాధానపరిచి పంపాడు. ఇలా ఉండగా ఎవరో వచ్చి, కామరూపేశ్వరుడు భీమ రాక్షసుడిని చంపే ప్రయత్నంలో ఉన్నాడనే వార్త అందించి వెళ్లారు. దాంతో అతడు కారాగారంలో ఉన్న కామరూపేశ్వరుని వద్దకు వెళ్లి ఏమేం పూజలు చేస్తున్నాడో అనే విషయంపై ఆరాలు తయసాగాడు. రాజు చెప్పిన సత్యవచనాలు విని, ఆదుష్టుడు శివుణ్ణి అనేక విధాలుగా దూషించి, ఇక నుంచి శివునికి బదులుగా తనకేపూజలు చేయాల్సిందిగా శాసింాడు. కామరూపేశ్వరుడు దీనిని ప్రతిఘటించాడు. అపుడు భీముడు శివలింగంపై దాడి చేశాడు. అతడి ఖడ్గం లింగం వరకూ చేరేలోగానే, శివుడు ప్రత్యక్షం అయ్యాడు. అపుడు వారిరువురి మధ్యనా బాణాలు, కత్తులు, శూలాలు, గొడ్డళ్ళు వంటి వివిధ ఆయుధాలతో భీకరపోరాటం కొనసాగింది. చివరకు అక్కడికి విచ్చేసి ఉన్న నారదుని కోరికపై శివుడు నోటి నుంచి మంటలను ఊది ఆదుష్కర భీముణ్ణి భస్మీపటలం చేశాడు. ఈవిధంగా శివుడు దేవతలకు విముక్తి కలిగించాడు. అపుడు అక్కడికి వచ్చిన దేవతలు శివుడిని అక్కడే నివాస్థానం ఏర్పరుచుకోవలసిందిగా కోరారు. లోక కల్యాణ దృష్ట్యా భీమశంకర నామధేయుడై శివుడు జ్యోతిర్లింగ రూపంలో అక్కడ వెలశాడు.
స్వయంభూ మహాదేవుడు రథాకృతిగల ఈ కొండపై వెలశాడు. ఈ ప్రదేశాన్ని రథాచలమని కూడా పిలుస్తారు. ఇక్కడ భతీరావు లకడ్ హోరా అనే కట్టెలు కొట్టుకునేవాడు ఉండేవాడు. ఒకసారి అతడ కట్టెలు కొట్టుకుంటూంటే, గొడ్డలి వేటు పడుతూనే, భూమి నుండి రక్తం చిమ్మసాగింది. భతీరావు భయపడ్డాడు. అక్కడి నుండి పరుగెత్తాడు. చాలా మంది ఆ ప్రదేశంలో గుమిగూడారు. ఎవరో ఒకపాడి ఆవును తెచ్చి అక్కడ నిలబెట్టారు. ఆ ఆవు పొదుగుల నుంచి పాలు వాటంతకవే కారసాగాయి. అలా కారిన పాలధారలు రక్తం చిమ్మిన చోటుని తాకగానే రక్తం కారటం తగ్గిపోయింది. ఆశ్చర్యం కలింగించే విధంగా , అక్కడ భూమిలోంచి ఒక శివలింగం జ్యోతిర్లింగంగా ప్రత్యక్షం అయింది. ప్రజలు దానికొక గుడిని నిర్మించి ఆ జ్యోతిర్లింగాన్ని అందులో ప్రతిష్ఠించారు. ఈ గుడినే తరువాత భీమశంకర నామంతో పిలవసాగారు.
శివలీలామృతం, గురుచరిత్ర, స్తోత్ర రత్నాకరం వంటి ధార్మిక గ్రంథాలలో భీమశంకర మహిమ వర్ణించబడింది. గంగాధర పండత్, రామదాస్, శ్రీధరస్వామి, నరహరిమాలో, జ్ఞానేశ్వర్ వంటి సాధుమహాత్ములు భీమశంకరుణ్ణి జ్యోతిర్లింగంగా ఆరాధించి గౌరవించారు.
ఛత్రపతి శివాజీ మహారాజు మరియు రాజారామ్ మహారాజు శ్రీ భీమశంకరుని దర్శనార్థం ఇక్కడికి వచ్చేవారు. పీష్వా బాలాజీ విశ్వనాథ్ మరియు రఘునాథ్ జీ లకు ఇది అత్యంత ప్రీతిపాత్రమైన స్థలం. రఘునాథ్ పీష్వా ఇక్కడొక నుయ్యి తవ్వించాడు. పీష్వాల దీవాన్ నాడా ఫడణ్ వీస్ ఇక్కడి గుడి యొక్క పునర్నిర్మాణం చేయించాడు. పూణేకు చెందిన షావుకారు చిమణ్ జీ అంతాజీ నాయిక్ - భిండే క్రీ.శ 1437లో ఈ మందిరానికై సభామంటపాన్ని నిర్మించాడు.
భీమశంకరుని గుడిని హేమాడ్ పంథీ పద్ధతిలో నిర్మించారు. మందిరాన్ని దశావతార ప్రతిమలతో అలంకరించారు. ఇవి అత్యంత సుందరంగా ఉంటాయి. ముఖ్యదేవాలయానికి దగ్గరలో నందిగుడి ఉంది. గుడి దగ్గర సుమారు 5మణుగుల బరువుగల ఒక బృహత్తరమైన గంట ఉంది. దీనిపై క్రీ.శ.1721 అని చెక్కబడి ఉంది. దీని నాదంతో మందిర పరిసర ప్రాంతం అంతా ప్రతిధ్వనిస్తుంది. భీమశంకరుని పూజలో ప్రతిరోజూ రుద్రాభిషేకం, పంచామృత స్నానం విధిగా జరుగుతాయి. పూజా సాహిత్యం అతి విలువయినది. సోమవారం లేక ఇతర దినాలలోనూ కూడా భక్తకోటి ఇక్కడికి దర్శనార్థం వస్తూంటారు. మహాశివరాత్రి నాడు ఇక్కడ పెద్దమేళా ఏర్పాటవుతుంది. ఈ తీర్థస్థానపు ప్రకృతి సౌందర్యం నయనాభిరామం.
భీమశంకర ఆలయం పరిసర ప్రాంతాలలో దర్శనీయ స్థానాలు చాలా ఉన్నాయి. వాటిలో మోక్షకుండం, జ్ఞానకుండం, గుప్తభీమేశ్వరం, సర్వతీర్థం, పాపనాశిని, ఆఖ్యాతీర్థం, వ్యాఘ్రపాదతీర్థం, సాక్షి వినాయకుడు, గోరఖ్ నాథ్ ఆశ్రమం, దైత్య సంహారిణి కమలజాదేవి స్థానం, కమలజా తటాకం, హనుమాన్ తటాకం, ఇత్యాది స్థానాలున్నాయి. ఇక్కడి కోకణ్ కగార్ లేదా నాగఫణ్ అదే ప్రదేశం చాలా భీతికలిగిస్తుంది. సుమారు మూడువేల అడుగుల ఎత్తున గల ఈ ప్రదేశం నుండి కోకణ ప్రదేశం అంతా కానవస్తుంది. గాలిలో ఎగురుతూ మనం ఈ ప్రదేశాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ దృశ్యాన్ని "కోకణ్ కగార్" పై నిలబడి చూడటం అసాధ్యం. కగార్ నేలపై పడుకుని చూడాలి. పడుకుని చూస్తున్న వ్యక్తి యొక్క కాళ్లను జారకుండా వేరేవారు పట్టుకుని ఉండాలి. ప్రకృతి యొక్క ఈ భీకర ప్రదేశం భయం కలిగించేదయినా, ఈ సుందర దృశ్యాన్ని చూసినపుడు భక్తులు తప్పక, "జయ భీమ శంకరా, జయ భీమ శంకరా" అని గట్టిగా నినాదం చేయవలసిందే.
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఏడవది శ్రీ రామేశ్వరుడు. క్షేత్ర ప్రాధాన్యత, చరిత్ర కొరకు ఈ లింక్ క్లిక్ చేయండి
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి