పాత సినిమాల్లో మంత్ర తంత్రాల గురించి చాలా విచిత్రమైన కథలుంటాయి. ఓం హీం..హ్రీం..అంటూ మంత్రగాళ్లు తమ విద్యను ప్రదర్శిస్తుంటారు. మరి ఇలాంటి మంత్రాలు అసలు ఉన్నాయా.. లేక ఇవి కాకుండా వేరే మంత్రాలు ఉన్నాయా.. మంత్రాల వల్ల అసలు ఉపయోగం ఉందా.. తెలుసుకుందాం..

mantra veda కోసం చిత్ర ఫలితం


వాస్తవానికి ఇలాంటి మంత్రాలేమీ ఉండవు.. నిజానికి మంత్రం అనేది పవిత్రమైన ఉచ్చారణ. అది భావగర్భితమైన అక్షరం అంటారు. శ్రీరామానుజులు. మరి లేనప్పుడు మంత్రాల వల్ల ఉపయోగం ఉంటుందా.. అంటే ఉంటుంది.. మంత్రాక్షరాల ఉచ్చారణ వల్ల, పరిసరాల్లో నిర్వచనానికి అందనంతగా ప్రకంపనలు కలుగుతాయని అధర్వ వేదం చెబుతోంది.

సంబంధిత చిత్రం


అసలు ‘మన్‌’ అంటే మానసికం, ‘త్ర’ అంటే సాధనం. మంత్రం అనేది మానసిక సాధనం. మంత్రాలన్నీ వేదాల్లోని భాగాలు. యజుర్వేదంలోని వేలాది మంత్రాల సమాహారాన్నే మంత్రపుష్పం అంటారు. సామాన్యంగా యజ్ఞయాగాల సమయంలో మంత్రపుష్పాన్ని చదువుతారు.

సంబంధిత చిత్రం


పరమ పురుషుడే మంత్రపుష్పాన్ని తొలుత ఉచ్చరించాడంటారు. అలా వ్యక్తమైన మంత్రాన్ని సమస్త ప్రాణికోటికి అందించేందుకు ఇంద్రుడు అన్ని వైపులా వ్యాపింపజేశాడట. మోక్షమార్గానికి మంత్రపుష్పాన్ని మించింది లేదని యజుర్వేదం వెల్లడిస్తోంది. అన్ని శుభాల్నీ కలగజేసే శ్రీమన్నారాయణుడికి నమస్కారం అనే శ్లోకపాదం మంత్రపుష్పంలో కనిపిస్తుంది. అదీ మంత్రాల సంగతి.


మరింత సమాచారం తెలుసుకోండి: