శివరాత్రి హిందువులకు చాలా పవిత్రమైన పండుగ. ఆ రోజు జాగారం చేస్తే సకల పుణ్యాలు లభిస్తాయని.. పాపాలు హరించుకుపోతాయని నమ్ముతారు. కొందరు శివరాత్రి రోజు జాగారంతో పాటు ఉపవాసం కూడా ఉంటారు. అలాంటి వారు ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

Image result for shiva pooja


ఉపవాసం చేసేవారు కొందరు పూర్తిగా ఆహారం మానేస్తారు. మరికొందరు పళ్లు తీసుకుంటారు. చాలామంది పండ్ల రసాలు, పళ్లు కొద్దిగా ఆహారంగా తీసుకుంటారు. ఎవరైనా సరే ఉపవాసం ఉండే ముందురోజు ఎక్కువ ఆహారం తీసుకోకూడదు. అంతేకాదు.. ఉపవాసం ఉండే రోజు ముందు రోజు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.


దీనివల్ల ఉపవాసం రోజు మీకు ఇబ్బంది కలగదు. అలాగే ఉపవాసం ఉండే ముందు రోజు కారం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోకూడదు. ఆరోగ్యకరంగా ఉపవాసం చేయాలనుకునేవారు ఆహారం తీసుకోకపోయినా సరే సరిపడా నీరు మాత్రం తీసుకోవాలి. సాధ్యమైనంత వరకూ ఎక్కువగా నీళ్ళు తీసుకోవాలి.

Image result for shivarathri upavasam


ఉపవాసం ఉన్న సమయంలో పండ్లు తినేటట్టయితే... తాజా పండ్లను మాత్రమే తీసుకోవాలి. కడుపు నింపే అరటిపండ్లు మరియు పాలు వంటివి ఉపవాసం రోజున తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఉపవాసం ముగియగానే.. ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోవడం చేయకూడదు.


మరింత సమాచారం తెలుసుకోండి: