శివుడు నాద శరీరుడు. ప్రతిరోజు సంధ్యాసమయంలో ఆయన మహోత్సాహంతో చేసే వీరతాండవాన్ని చూడటానికి బ్రహ్మాదిదేవతలు పోటీపడి వస్తూ ఉంటారని అంటారు. వివిధ వాయిద్యాలతో తాళమేళాలతో అనునిత్యం ప్రతిరోజు కొనసాగే ఈ తాండవంతో కైలాసం కదిలిపోతుందని ప్రతీక. ముఖ్యంగా శివుడి తల పై ఉన్న గంగ గజగాజలాడుతూ తొణికి పోతుందనీ ఎక్కడ శివుడు ఆగ్రహంతో మూడవ కన్ను తెరుస్తాడో అన్న భయంతో దేవతలు కూడ హడలి పోతారని అంటారు. 

ఇలాంటి శివ తాండవంలో ఒక పరమాణువుల శక్తి దాగుందని 1972 లో ఫ్రిట్జఫ్ కాప్రా అనే భౌతిక శాస్త్ర వేత్త తన పరిశోధనలో తెలియచేసాడు. పరమాణువులు నిరంతరంగా జనిస్తూ ఉండే ఈ శివ నాట్యంలోని లయ నేటి భొతిక శాస్త్రం కనిపెట్టిన అణుబాంబుకు దగ్గరలో ఉంటుందనీ ఆ విదేశీ భౌతిక శాస్త్రవేత్త తెలియ చేయడమే కాకుండా ప్రతి అణుబాంబులో ఉండే ప్రోటాన్ సృష్టికి శివతాండవం నిదర్శనం అంటూ మరో విదేశీ భౌతిక శాస్త్రవేత్త కెన్నెత్ ఫోర్డ్ అభిప్రాయ పడ్డారు అంటే శివతాండవంలో చైతన్యం ఏస్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు.
maxresdefault%2B%25281%2529
శివుడు శివతాండవంలో ఢమరుకం మోగిస్తాడు. అయితే ఆ ఢమరుక శబ్దాల వెనుక వేదాలలో ఉండే నమక చమక శబ్దాల అర్ధాలు వినిపిస్తాయి అని అంటారు. అందువల్లనే ఐదు రూపాలతో శివ చైతన్యం విశ్వ వ్యాప్తంగా కనిపిస్తుంది అన్నది వైదిక భావన. 
கேள்வி 1
స్నానం మంత్రం దయ దానం సత్యం ఇంద్రియ నిగ్రహం జ్ఞానం మనస్సు శుద్ధి ఈ ఎనిమిది లక్షణాలు కలిగిన వ్యక్తులుకు మాత్రమే శివానుగ్రహం లభిస్తుంది. అయితే సంకీర్తనలతో శివనామస్మరణతో ‘మహాశివరాత్రి’ నాడు ప్రాపంచకమైన ఏవిషయాలు పట్టించుకోకుండా శివుడి పై ఉంచి ధ్యానం చేసిన సాధారణ వ్యక్తులకు కూడ శివానుగ్రహం లభించే అవకాసం ఉందనీ ఋషులు చెపుతున్నారు. విశ్వంలోని అణువణువులోను ఈరోజు శివుడుని చూస్తూ శివ ధ్యానం చేసేవారికి మరోజన్మ లేకుండా శివుడులో ఐక్యం అవుతారని మన నమ్మకం.మరింత సమాచారం తెలుసుకోండి: