ప్రతి ఏడాది జూన్ జులై మాసాల్లో హిందువులు చేసే యాత్రల్లో అమరనాథ్ యాత్ర ప్రముఖంగా ఉంటుంది.  ప్రతి సంవత్సరం ఈ యాత్రను కనీసం లక్షమంది చేస్తుంటారు.  మంచు కొండల్లో కష్టసాధ్యంతో కూడుకున్న యాత్ర.  కాలినడకన నడవలేని వాళ్ళకోసం ప్రత్యేకంగా ఢోలి ని ఏర్పాటు చేసుకుంటారు.  


ఈ ఢోలి ని మోసే కూలీలు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు.  హిందువులను ఇలా మోసుకుంటూ అమరనాధుడి వద్దకు తీసుకెళ్లడంలో ముస్లిం సోదరులు సహాయం చేస్తుంటారు.  ఈ రెండు నెలల కాలంలో వారి జీవనోపాధి ఇదే.  హిందువుల పవిత్రమైన చోటుకు ఇలా మోసుకుపోవడంలో తప్పు లేదని, ఇది అల్లా తమకు ఇచ్చిన గౌరవంగా భావిస్తామని ముస్లిం సోదరులు చెప్తున్నారు.  


కష్టం అనిపించినా జీవనోపాధి కోసం చేయక పట్టదని, ఇది తమకు కూడా ఒక పుణ్యకార్యం లాంటిదే అని అంటున్నారు.  రెండు మతాలవారూ కలిసి పనిచేస్తారు. అది చాలా అందమైన విషయం. యాత్రికుల సంరక్షణను స్థానికులు చూసుకుంటారు. వారి అవసరాలను తీరుస్తారు. యాత్రికులు కూడా వీరితో చక్కగా కలిసిపోతారు. అన్నిచోట్లా ఇలాగే జరిగితే ఎంత బాగుంటుందని యాత్రికులు అంటున్నారు.  


హిందూ ముస్లింలు కలిసి పనిచేస్తూ చక్కగా కలిసిపోతే దేశంలో ఎలాంటి గొడవలు రావు.  కేవలం రాజకీయం రాజకీయ నాయకులు ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.  ఇది నిజమే కదా.  అందరు కలిసిపోయి చక్కాగా ఎవరిపని వారు చేసుకుంటూ పొతే కావాల్సింది ఏముంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: