భగవద్గీత అనేది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు ఒక జీవిత సారం. భగవద్గీత లో కదిలే ప్రతీ పాత్ర మనిషి జీవితకాలంలో మెదిలే సుఖదుఃఖలకు అద్దం పడుతుంది. 
విద్యార్థులు, యువతకు ఉపయోగకరమైన యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందింప చేసే కోర్సులను అందించడంలో ముందుండే రామకృష్ణా మఠం లోని వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ తాజాగా నేటి అక్టోబరు 26 నుంచి భగవద్గీత ఏడో అధ్యాయం తరగతులకు శ్రీకారం చుట్టింది. రామకృష్ణ మఠంలో స్వామి బోధమయానంద ప్రతి శనివారం భగవద్గీత తరగతులు నిర్వహిస్తున్నారు. తెలుగు భాషలో నిర్వహించే ఈ భగవద్గీత తరగతులకు అన్ని వయసుల వారు హాజరుకావచ్చని., ప్రతి శనివారం సాయంత్రం 5.45 గంటల నుంచి 6.45 వరకూ ఈ తరగతులుంటాయని తెలిపారు.


గీత ఏడో అధ్యాయం సంపూర్ణమైన, సాపేక్షమైన భగవంతుని దివ్య జ్ఞానం గురించి తెలియజేస్తుంది. ఈ ప్రపంచం సాపేక్షమైన ఒక విషయాన్ని మరో విషయంతో సంబంధం లేకుండా అర్థం చేసుకోలేం. తండ్రి లేకుండా కొడుకు, భార్య లేకుండా భర్త, యజమాని లేని సేవకుడు ఖచ్చితంగా ఉండరు. అలానే వెలుతురు లేని చీకటి కూడా ఉండదు.

దీన్నే సాపేక్ష ప్రపంచం అంటారు. ఒకరు మరొక దానిని సాపేక్ష పదాలు ద్వారా అర్థం చేసుకొని, సంపాదించుకోవాలనేదే ఈ అధ్యాయ సారాంశం. ‘ఈశ్వరః పరమః కృష్ణః సత్-చిత్-ఆనంద-విగ్రహః అనాదిర్ ఆదిర్ గోవిందః సర్వ-కారణ-కారణం’ ప్రామాణిక గ్రంథం బ్రహ్మ సంహితలో కృష్ణుడి గురించి సాక్షాత్తు బ్రహ్మ ఇచ్చిన నిర్వచనం ఇది.


ఇక, చదువులతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న విద్యార్థుల కోసం రామకృష్ణ మఠం వారు ప్రత్యేకంగా ఆర్ట్ ఆఫ్ మెడిటేషన్ అనే ప్రోగ్రామ్‌ను రూపొందించి, అందులో భాగంగా మెదడుపై ఆలోచనల ప్రభావం, వాటి నియంత్రణ, ఆలోచనలను తగ్గించుకోవడం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవడం, సంతోషంగా ఎలా జీవించాలనే విషయాలపై స్వామి బోధమయానంద స్వామి విద్యార్థులకు విలువైన సూచనలు ఇస్తున్నారని సమాచారం. 16 నుంచి 25 ఏళ్లలోపున్న వారు ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: