అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు తప్పనిసరిగా శబరిమల వెళ్లి ఇరుముడి సమర్పించుకుని వస్తారు. అలాంట శబరిమల అభివృద్ధిపై ఇప్పడు కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందట. కేరళలోని శబరిమల ఆలయ పరిసరాల అభివృద్ధి కోసం రూ.192 కోట్లు మంజూరు చేయాలని కేంద్రం నిర్ణయించిందట.

 

శబరిమల సమీపంలోని పంపా సన్నిధానం అభివృద్ధికి వంద కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే శ్రీపద్మనాభ అర్నముల-శబరిమల అభివృద్ధికి రూ.92.22 కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. కేవలం కేటాయింపులతో సరిపెట్టకుండా ఈ మొత్తంలో ఇప్పటికే రూ.92.42 కోట్లు విడుదల కూడా చేశారు.

 

ఈ వివరాలను కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ తెలిపారు. ఆయన లోక్‌సభలో ఓ లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అయితే శబరిమల ప్రాంత అభివృద్ధికి ఆ రాష్ట్రప్రభుత్వం ఎలాంటి మాస్టర్‌ప్లాన్‌ రూపొందించలేదట. స్వదేశ దర్శన్‌ పథకంలో భాగంగా దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో మౌలికవసతుల కల్పనకు కేంద్రం అన్ని రాష్ట్రాలకూ నిధులు ఇస్తోంది. అందులో భాగంగానే శబరిమలకూ ఇస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: