సంక్రాంతి పండుగ వచ్చేసింది.. సరదాలు ఎన్నో తెచ్చేసింది.. ఆడి పాడి అల్లరి చేసేందుకు యువతులు చిన్నపిల్లలు రెడీ అయ్యారు... దేవుళ్ళను కొలిచేందుకు పెద్దలందరూ సిద్ధం అంటున్నారు... కొత్త అల్లుళ్ళు అత్తారింటికి వచ్చేశారు... ఇంకేముంది సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలుగు ప్రజలందరూ సాంప్రదాయంగా అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి మొదటిది. సంవత్సరం ప్రారంభంలోనే వచ్చే మొదటి పండుగ సంక్రాంతి. మూడు రోజుల పాటు జరిగే ఈ సంబరాలు తెలుగు రాష్ట్రాల్లో  అంబరాన్నంటాయి. సంక్రాంతి పండుగలో భాగంగా ఈ రోజు భోగి పండుగ జరుపుకుంటున్నాయి  ఈ తెలుగు రాష్ట్రాలు. 

 

 

 ఇప్పటికే భోగి పండగలో భాగంగా ఇళ్ళ ముందు భోగి మంటలు వేసి వాటిచుట్టూ చేరిపోయారు చిన్న పెద్ద. ఈ సంవత్సరం భోగి పండుగ  అరిష్టాలని తొలగించి సకల భాగ్యాలను కలిగించాలని కోరుకుంటున్నారు.మరో  వైపు భోగిమంటలతో అగ్నిదేవుని ఆరాధించడం తో పాటు స్వచ్ఛమైన గాలి తో వాయుదేవునికి కూడా నిష్టతో పూజిస్తున్నారు. ఉద్యోగాల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన ప్రజలందరూ సొంతూళ్లకు తరలివచ్చారు... కొత్తగా పెళ్లయిన కొత్త అల్లుళ్ళు కూడా అత్తారింటికి చేరుకొని సందడి చేస్తున్నారు. సంక్రాంతి సంబరాలు కొన్ని రోజుల ముందే మొదలై పోయాయి. ఇక పండుగ ఏదైనా... సందర్భం ఏదైనా ముక్క చుక్క ఉండాల్సిందే కదా. మన తెలుగు ప్రజలు మరింత మాంసం ప్రియులాయే. అంతకుమించి ఉద్యోగం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారందరూ ఊర్లోకి తరలివస్తారు. ఇక కొత్త అల్లుళ్లు కూడా అత్తారింటికి చేరుకోవడంతో... ముక్క సుక్క  లేకుంటే ఎలా. 

 

 

 సంక్రాంతి మూడు రోజుల పండుగలు మాంసం ప్రియులు ఎక్కువగా ఇష్టపడేది చివరి రోజైన కనుమ పండుగ. ఆరోజు మాంసం ప్రియులకు  ముక్క సుక్క  లేనిదే ముద్ద దిగదు. ఇంకేముంది అటు చికెన్ మటన్ అమ్మకాలు కూడా భారీగా పెరిగి పోతాయి. దీంతో గత కొన్ని రోజుల నుండి చికెన్ మటన్ షాప్ యజమానులు... తమ వ్యాపారాలను ప్లాన్ చేసుకున్నారు. ఇక మరోవైపు మద్యం వ్యాపారాలు కూడా జోరందుకున్నాయి. కాబట్టి  మాంసం అందరికీ అందుబాటులో ఉండేలా   మద్యం కూడా అందుబాటులో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు  చేస్తున్నారు మాంసం మద్యం షాపుల యజమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: