కేరళ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. బ్రాహ్మణేతరులను సైతం పూజారులగా నియమిస్తోంది. తాజాగా కేరళలో తొలి దళిత పూజారిగా యేదు కృష్ణన్ అనే వ్యక్తి చరిత్ర సృష్టించారు. తిరువళ్లకు సమీపంలోని మణపురం శివాలయ అర్చకునిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ట్రావన్ కోర్ దేవాలయ మండలి ఇటీవల 36 మంది బ్రాహ్మణేతరులను పూజారులుగా ఎంపికచేసింది.

 

 

 

వీరిలో ఆరుగురు దళితులు. శబరిమల ఆయ్యప్పస్వామి ఆలయం సహా 1248 దేవాలయాల ఆలనపాలన విషయాలను ఈ మండలి పర్యవేక్షిస్తోంది. సంస్కృతంలో స్నాతకోత్తర (పీజీ) విద్యను అభ్యసిస్తున్న యేదుకృష్ణన్ గత పదేళ్లుగా పూజాక్రతువులను నేర్చుకున్నారు.

 

 

 

తన గురువు అయిన కేకే అనిరుద్దన్ తంత్రినుంచి ఆశీర్వాదం పొందిన అనంతరం ప్రధాన అర్చకులు గోపకుమార్ నంబూద్రి మంత్రోచ్చారణల మధ్య కృష్ణన్ ఆలయ ప్రవేశం చేశారు. 1936 నవంబరు 12న ట్రావన్ కోర్ సంస్థానం నిమ్నకులాల వారికి ఆలయ ప్రవేశ అర్హతను కల్పిస్తూ శాససనం చేసింది. ఆ ప్రకటన వెలువడి 81 ఏళ్లు పూర్తికావస్తున్న సమయంలో దళిత వ్యక్తి పూజారిగా బాధ్యతలు స్వీకరించటం విశేషం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: