మహా విష్ణువు బ్రహ్మాండాన్ని కాపాడడానికి శ్రీ కృష్ణుడిగా ఎనిమిదవ అవతారమున జన్మించిన రోజునే "కృష్ణాష్టమి" అని పిలుస్తారు..శ్రీ కృష్ణుడు దేవకి వసుదేవులకు ఎనిమిదో గర్భంగా శ్రావణ మాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు జన్మించాడు. అయితే ఎప్పటికన్నా దేవకీ కడుపునా జన్మించిన మగ శిశువు చేతిలోనే మేనమామ అయినా కంసుడి ప్రాణాలు పోతాయని తెలుసుకున్న కంసుడి దేవకిని చెరసాలలో బంధిస్తాడు. అలా కంసుడు చెరసాలలో జన్మించిన దేవకీ అష్టమి సంతానమే మన శ్రీ కృష్ణుడు.ఈ కృష్ణాష్టమి రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి, తలస్నానము చేసి కొత్త బట్టలు ధరించాలి.తర్వాత ఇంటిని పూజా మందిరమును శుభ్రం చేసుకోవాలి.గడపకు పసుపుకుంకుమ,గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులు వేయాలి.కృష్ణుడికి తులసి అంటే చాలా ఇష్టం. అందుకే ఈరోజున తులసి చెట్టుకు పూజ చేయాలి. కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయం కాలం శ్రీ కృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు.
మన చిన్ని కన్నయ్య వెన్న దొంగ. అందుకే వెన్నని నైవేద్యంగా పెట్టాలి.తదనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పూజను ప్రారంభించాలి. కంచుదీపంలో కొబ్బరినూనె పోసి, ఐదు దూది వత్తులతో దీపమెలిగించాలి. భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే మంచి ఫలితం దక్కుతుంది. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు.పిల్లలు పెద్దలు ఈ ఉట్టి మహోత్సవంలో భలే ఆడుతూ పాడుతూ పాల్గొంటారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి