దీంతో కోపానికి గురైన శివుడు బాలుడి తలను ఖండించి లోనికి వెళ్లాడు. పార్వతీదేవి స్నానం చేసి, సర్వాలంకారాలతో శివుడి వద్దకు వస్తుంది. అయితే ఇద్దరూ మాట్లాడుకుంటూండగా వాకిట్లో తనను అడ్డగించిన బాలుడిని సంహరించినట్టు శివుడు ఆమెకి చెప్పుతాడు. శివుడు చెప్పిన ఆ వార్త విన్న పార్వతి దుఃఖించడం మొదలు పెట్టింది. పార్వతిని ఓదార్చి తాను తెచ్చిన గజాసురుని ముఖాన్ని బాలుడి మొండేనికి అతికించి ప్రాణం పోశాడు శివుడు. ఆదిదంపతులు ఆ బాలుడిని కుమారుడిగా స్వీకరించారు. అతడికి ఎలుకను వాహనంగా ఇస్తారు.
అయితే భాద్రపద శుద్ధ చవితినాడు యథావిధిగా వినాయకుని పూజిస్తుంటారు. ఈ శమంత కోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న వారికి, ఆరోజు చంద్ర దర్శనం అయినా కూడా అపనిందలు కలగవు’’ అని శ్రీకృష్ణుడు తెలిపాడు. ఆ నాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు.ఈ కథను చదివి గాని, విని గాని తలపై అక్షతలను వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి. చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి, సాష్టాంగ నమస్కారాలు చేయాలని పేర్కొన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి