అదేవిధంగా మిగిలిన రోజుల్లో తలస్నానం చేస్తే అనారోగ్యమైన పరిస్థితి మరియు ఇతర విషయాలలో ప్రతికూలంగా ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి తలస్నానం ఏ రోజుల్లో చేస్తే మనకు మేలు జరుగుతుందో తెలుసుకోవాలి. సోమవారం రోజు తలస్నానం చేయరాదు. ఫలితం కలవరము, కాంతిహీనం,భయం కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. దోష పరిహారం కొరకు కొబ్బరినూనెలో మందారపూలను వేసి తలంటుకొని స్నానం చేస్తే దోష పరిహారం కాగలదు. మంగళవారం నాడు స్త్రీలు అసలు తలస్నానం చేయకూడదు.
ఫలితం విరోధం, అపాయం, ఆయుక్షీణం, భర్తకు పీడ కలుగుతుంది.
బుధవారం తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. లాభం, కీర్తి, సంపద కలుగును, జ్ఞానము పెరుగుతుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.
గురువారం రోజు తలస్నానం కూడా మంచిది కాదంటున్నారు. ఫలితం అశాంతి, విద్యా లోపము, కీడు వంటివి జరుగుతాయని చెబుతున్నారు. శుక్రవారం నాడు తలస్నానం చేస్తే మంచిది అని అందరూ అనుకుంటారు కానీ శాస్త్రాల ప్రకారం శుక్రవారం తలస్నానం చేసిన ఫలితం. అశాంతి, వస్తు నాశనం, జరుగుతాయని చెబుతున్నారు. శనివారం తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆయుస్సు వృద్ధి, వస్తు సేకరణ లాభం, కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. ఆదివారం నాడు తలంటు స్నానము చేయకూడదట. కలత,అనారోగ్యం ఏర్పడుతుంది, దు:ఖప్రదం, సంతానంకు కీడు జరుగుతాయని చెబుతున్నారు...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి