దేవుడిని నమ్మని వారు చాలా అరుదు. మనలో చాలామంది దేవుణ్ణి నమ్ముతారు.. గుళ్లు, గోపురాలకు తిరుగుతారు. పూజలు చేస్తారు. అంతా బాగానే ఉంటుంది. కానీ.. అది ఆ కొద్దిసేపే.. ఆ తర్వాత అంతా మన బిజీ లైఫ్‌.. కానీ.. దేవుడు అది కోరుకోవడం లేదు. మరి దేవుడు ఏది కోరుకుంటున్నాడో.. ఆయనే చెబితే ఎలా ఉంటుంది.. ఇదిగో ఇలా ఉంటుంది..

"నువ్వు రోజూ నిద్ర లేచాక నా వేపు చూస్తావనీ , నన్ను పలకరించి రెండు మాటలు మాట్లడతావనీ ఎదురు చూస్తుంటాను ... కానీ.. నువ్వు లేచీ లేవగానే నీ సెల్ ఫోన్ తీస్తావు . అందులో నీకు వచ్చిన మెస్సేజెస్ చూస్తావు ... అది అయ్యాక నా వేపు చూస్తావేమో అనుకుంటాను . అపుడు నీకు టైం కనిపిస్తుంది . అప్పుడే టైం అయిపోయిందా అనుకుంటూ గబగబా పక్క దిగి బాత్ రూం లోకి వెళ్లి పోతావు . అక్కడనుండి వచ్చాక నేను ఉన్న చోటికి వచ్చి ఒక సారి నా వేపు చూసి పలకరిస్తావు అని చూస్తుంటాను .. కానీ.. డైనింగ్ టేబుల్ దగ్గరకి వెళ్లి టిఫెన్ తింటూ పేపర్ చూస్తూ టి వి ఆన్ చేసి వార్తలు చూస్తుంటావు .


టిఫిన్ అయ్యాక గబగబా డ్రెస్ చేసుకుని ,జుట్టును తీరిగ్గా దువ్వుకుని , సెంటు రాసుకుని , ముఖానికి ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుని , షూ వేసుకుని బయటకు వెడుతూ నా కేసి చూస్తావేమో అనుకుంటాను కానీ.. బయటకు ఆదరా బాదరా వెళ్లి పోతావు ..అయ్యో నీకు పాపం తీరిక లేదే అని బాధ పడడం తప్ప ఏమి చెయ్యను ? పోన్లే !.. మధ్యాహ్నం లంచ్ టైం లో భోజనం కారియర్ విప్పుతూ కాంటీన్ లో నాలుగు టేబుళ్ళ వెనకాల ఒకాయన కళ్ళు మూసుకుని నన్ను తలచుకుంటుంటే నువ్వు  కూడా  నన్ను  తలచుకుంటావు  అని  ఎదురు  చూస్తున్నాను .. కానీ.. నువ్వు  నవ్వుకుని నీ స్నేహితుడితో సినిమా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేసేసావు .

సాయంత్రం ఇంటికి వచ్చాక తీరు బడిగా నాతో మాట్లాదతావేమో అని అనుకున్నాను . కానీ సాయంత్రం ఇంటికి వస్తూ దారిలో రెండు మూరల మల్లె పూలు కొన్నావు . నా కోసం కూడా పూలు కొంటున్నావు అనుకున్నాను . నీకు అవి కనిపించ లేదనుకుంటాను . పూలెందుకు ? నువ్వు నాతో మాట్లాడితే చాలు . నా కేసి చూస్తే చాలు . ఇంటికి వచ్చావు . సోఫాలో కూల బడి టి వి చానల్ మార్చి మార్చి చూస్తూ కాఫీ తాగావు . బాత్ రూం కి వెళ్లి స్నానం చెసి వచ్చి తెల్లటి బట్టలు కట్టుకున్నావు . అప్పుడు కూడా నా కేసి వస్తావనీ , నాతో మాట్లాడతావనీ ఎదురు చూశాను . కానీ నీ లాప్  టాప్  ముందుకు వెళ్లావు . అందులో నీకు ఇష్టమైన వన్నీ చూస్తూ  రాత్రి 11 గంటల వరకూ గడిపావు . ఇక నీకు నిద్ర వస్తోంది . అపుడు నా దగ్గరకు వస్తావు అని అనుకున్నాను . నీ ఎదురుగా నే ఉన్నాను . కానీ నువ్వు నన్ను చూడలేదు . ఇంకో అరగంట తర్వాత నా కేసి చూస్తావు అనుకున్నాను . నువ్వు అలిసిపోయావు . నీ భార్య తో గుడ్ నైట్ చెప్పి పడుకుండి పోయావు . నాకూ చెబుతావు అనుకున్నాను  చెప్పలేదు.. పోన్లే ! నాకు ఓపిక ఉంది . నేను ఎదురు చూస్తుంటాను . నీకు కూడా ఇతరులతో ఎలా ఉండాలో నేర్పాలన్నదే నా తపన .

నేను నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను . . కానీ ... కానీ ... నాకు కూడా నీవు నా వేపు చూడాలనీ , ఒక్క సారి నా ముందు తల వంచి నన్ను పలకరించాలనీ ఉంటుంది . నీ గుండెలో ఉన్న నన్ను నువ్వు చూడడానికి నీ ప్రయత్నం ఏమీ చెయ్యక పోతే ఎలా ? ఒకవైపు నుండే సంభాషణ ఎలా ? ఇదిగో ఈ మెయిల్ చూశాక అయినా నీవు నా వేపు చూస్తావనీ , నాతో రోజులో కొన్ని సెకనులు అయినా గడుపుతావనీ ఎదురుచూస్తుంటా ! నీ లోనే నీతోనే ఉన్న "నేను". 

మరింత సమాచారం తెలుసుకోండి: