పూజ గదిని ప్రత్యేకంగా అలంకరించుకోవాలి. ముఖ్యంగా అమ్మవారిని అందంగా అలంకరించాలి. దేవుడి ముందు నైవేద్యంగా మొదటిగా ఉగాది పచ్చడిని, ఆ తరువాత ఏవైనా పిండివంటలను నైవేద్యంగా సమర్పించాలి. ఇక ఉగాది ప్రత్యేకత గురించి చెప్పాలంటే...చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ లోకాన్ని సృష్టించాడని పురాణం చెబుతోంది. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్సావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా 'ఉగాది' ఆచరణలోకి వచ్చిందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ విధంగా ఉగాది పండుగ ఆవిర్భవించిందని ప్రతీతి.
ఇక ఈ పండుగను తెలుగు వారే కాకుండా... తమిళులు 'పుత్తాండు' అనే పేరుతో, మరాఠీలు కూడా ఈ రోజు 'గుడిపడ్వా'గా,బెంగాలీలు 'పోయ్ లా బైశాఖ్', మలయాళీలు 'విషు' అనే పేరుతో, సిక్కులు 'వైశాఖీ'గా ప్రత్యేకించి ఈ పండుగను జరుపుకుంటారు. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఇంటి ముందు ముగ్గులు, కమ్మటి పిండి వంటలు, గుమ్మాలకు తోరణాలతో ఈ పండుగ కనులవిందుగా జరుపుకుంటారు. ఇదంతా బాగానే ఉంది. కానీ ప్రతి పండుగకు మనము ఏదో ఒక దైవాన్ని పూజించడం పరిపాటి. అలాగే ఈ ఉగాది పండుగ నాడు ఏ దైవాన్ని పూజిస్తారో తెలుసా...? కలిపురుషుడు అధిదేవత. అందుకనే ‘ఓం కాలాయనమః’ అనే నమక మంత్రం గాని విష్ణు సహస్రం గాని పఠించాలి. భగవంతుడే కాలపురుషుడని, నిత్యం అతణ్ణి ధ్యానించాలని శాస్త్రం చెబుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి