ఇటీవలే తెలుగు ప్రజల నూతన సంవత్సరం ఉగాది పండుగ, శ్రీరామనవమి పండుగలను జరుపుకున్నాము. ఇప్పుడు ఆ శ్రీరాముని పరమ భక్తుడు అయినటువంటి ఆ ఆంజనేయుని జయంతి రాబోతుంది. 2021 సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో 27వ తేదీన అంటే మంగళవారం రోజున హనుమాన్ జయంతిని జరుపుకోబోతున్నాము. మంగళవారం ఆ ఆంజనేయుడికి అంకితం చేయబడిన రోజు కాబట్టి...ఇది మరింత ప్రత్యేకంగా మారనుంది. ఆ ఆంజనేయస్వామిని నమ్మి భక్తి శ్రద్ధలతో పూజిస్తే.. ఆయన నిరంతరం మనతోనే ఉంటాడంటారు. అయితే ఆ హనుమంతుని చల్లని చూపు మన వైపు ఉండాలన్నా, హనుమాన్ అనుగ్రహం మనపై ఉండాలన్నా... ఆయనకు ప్రత్యేకమైన పూజలు ప్రత్యేక పద్ధతిలో చేయాల్సి ఉంటుంది. అయితే వాటిని ఎలా చేయాలో ఆ విధానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

హనుమాన్ జయంతి నాడు... తెల్లవారుజామునే లేచి, తలస్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఇంటిని శుభ్రపరిచి పూజామందిరాన్ని ప్రత్యేకంగా అలంకరించాలి. ఆ అలంకరణలో తమలపాకులు ఉండేలా చూసుకోవాలి. అనంతరం ముందుగా గుడికి వెళ్లి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలి. హనుమంతుడికి ఎంతో ప్రీతికరమైన తమలపాకులతో చేసిన మాలను ఆ శ్రీ ఆంజనేయునికి సమర్పించుట మంచిది.  ఇక ఇంటి లోని పూజా మందిరంలో.. పూజ చేయు విధానం. ముందుగా పంచముఖ ఆంజనేయ ప్రతిమను కానీ, ఫోటోను కానీ పూలతో అలంకరించి... ఎర్రటి అక్షింతలు సిద్ధం చేసుకోవాలి.

పక్కనే శ్రీ రాముని విగ్రహాన్ని లేదా ప్రతిమను కూడా ఉంచుకోవాలి. జిల్లేడుతో చేసిన ఒత్తులతో... దీపాన్ని వెలిగిస్తే మంచి ఫలితం అందుతుందని మరియు మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది అని ప్రతీతి. పూజ చేసే సమయంలో హనుమాన్ చాలీసా కానీ... లేదా ఓం ఆంజనేయాయ నమః.. జై వీరాంజనేయ వంటి నామాలు 108 సార్లు జపిస్తూ పూలతో పూజించాలి. అదే విధంగా శ్రీ ఆంజనేయునికి సమర్పించిన ప్రసాదాన్ని చిన్న  పిల్లలకు ఇవ్వడం మంచిది. అలాగే ఆంజనేయస్వామి లాకెట్ ఉంచి పూజ చేసి... ఆ లాకెట్ ను మీ చిన్నారులకు వేస్తే అంతా మంచే జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: