హిందువులకూ చాలా సెంటిమెంట్స్ ఉంటాయి ఏది జరిగినా దాని వెనుక కారణం, అంతరార్థం ఉంటుందని నమ్ముతారు. అలాగే ఇంట్లో ఏమైనా  వరుసగా అపశ్రుతులు దొర్లుతూ ఉంటే...అనగా  ఇంట్లో తరచూ సమస్యలు ఎదురవుతుండడం, కష్టాలు ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటే ఎందుకిలా జరుగుతోంది,  మనకి ఏమైనా చెడు కాలం మొదలయిందా అని తెగ కంగారు  పడుతుంటారు. అయితే అలాంటి దుష్ప్రభావాలు ఏవైనా మన ఇంటి మీద ఉన్నాయన్న ఆలోచన చాలా మందికి వస్తుంది. అలాంటప్పుడు అవి ప్రాథమిక దశలో ఉన్నప్పుడే వాటిని బయటకు పారద్రోలుటకు ముందుగా ఇంట్లో ఇష్ట దైవానికి ప్రత్యేకమైన పూజను నిర్వహించాలి. అనంతరం సాంబ్రాని పొగను ఓ వైపు ఇల్లంతా వేస్తూ మరో వైపు గంటను మోగించాలి. ఇలా ఇంట్లోని ప్రతి చోట ఆఖరికి స్నానాల  గదిలో కూడా వేయాలి. 

అప్పుడు ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ మాయమవుతుంది. ఇక అలా కాకుండా మన ఇంట్లో సమస్యలు కనుక చాలా ఎక్కువ ఉన్నట్లయితే ఆదివారం నాడు లేదా అమావాస్య నాడు గుమ్మడి కాయని తీసుకొచ్చి వీలైతే ఆ గుమ్మడి కాయను పట్టుకుని మూడు సార్లు ఇంటి చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి అనంతరం ఆ గుమ్మడి కాయను పట్టుకుని "ఓం హ్రీం సర్వ విగ్న క్రిత్భ్యో సర్వ భూతేబ్యో హం ఫట్ స్వాహా" అన్న మంత్రాన్ని మూడుసార్లు కుడివైపుకు తిప్పుతూ, మరో మూడు సార్లు ఎడమవైపుకు తిప్పుతూ జపించాలి. అనంతరం గుమ్మడి కాయను నేలపై కొట్టాలి.
 
ఇలా మంత్రం చెబుతూ చేసినట్లయితే ఏవైతే దుష్ట శక్తులు ఇంట్లో ఉంటే అవన్నీ ఆ గుమ్మడికాయ వద్దకు వచ్చి చేరుతాయి. అనంతరం ఆ పగిలిన గుమ్మడికాయను నల్ల సంచిలో ఉంచుకుని మన ఇంటికి నైరుతి వైపు వెళ్ళి పడేయాలి. అనంతరం శుక్రవారం నాడు మహాలక్ష్మికి పూజ చేసుకుని ముత్తైదువులకు వాయినం ఇచ్చి పంపించాలి. ఇలా చేస్తే ఇక అన్ని కష్టాలు తొలగిపోయి మన ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: