ఈ శ్రావ‌ణ ఆదివారం ఎన్నో ప్ర‌త్యేక‌త‌ల‌కు నిల‌యం.. సమాహారం..ముఖ్యంగా ఈ ఆదివారం రోజు అమ్మ‌వారిని అర్చించేందుకు ఓ విశిష్ట‌మ‌యిన పూజ ఒక‌టి ఉంది. అదెంటో తెలుసుకుందాం..వీరుల స్మ‌ర‌ణ చేస్తూనే, అమ్మ‌వారిని స్తుతిస్తూ భార‌తావ‌నికి శుభాలే క‌ల‌గాల‌ని వేడుకుందాం. శ్రావణ మాసంలో వచ్చే ముప్పై రోజులు ఎంతో ప్రత్యేకమైనవి మరియు పవిత్రమైనవి. ఈ మాసంలో వచ్చే మొదటి సోమవారం, మంగళవారం, బుధవారం ఇలా అన్ని వారాలకు ఒక్కో విశేషం ఉంది.  సాధారణంగా చాలా మంది నిత్య దీపారాధన చేస్తూ...పలు కారణాల వలన ఆదివారం ఒక్క రోజు మాత్రం పూజను చేయరు.  అయితే శ్రావణమాసంలో మాత్రం దాదాపు హిందువులు అందరూ ఆదివారం కూడా పూజ చేస్తారు. ఈ మాసంలో ప్రతి రోజూ క్రమం తప్పకుండా నిత్య పూజను మరియు ప్రత్యేక పూజలను చేస్తుంటారు.

శ్రావణమాసంలో అన్ని వారాలకు లాగే  ఆదివారం నాడు కూడా ఒక విశిష్టత ఉంది. భానువారం నాడు ఈ పూజ చేస్తే మీ ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ పూజ ఈ విధంగా ఆచరించాలో తెలుసుకుందాం. స్నానమాచరించి తరువాత సూర్య నమస్కారాలు చేయాలి. అనంతరం పూజ సమయంలో మహాలక్ష్మి ప్రతిమను కానీ అమ్మవారి చిత్ర  పటాన్ని కానీ కుంకుమ, పసుపు, పూలతో అలంకరించాలి. అక్షింతలను పూజకు సిద్దం చేసుకోవాలి. దీపారాధన అయిన అనంతరం అమ్మవారిని ఇలా స్తుతిస్తూ అక్షింతలతో అర్చించాలి ( అనగా అమ్మవారిపై అక్షింతలు వేస్తూ  మంత్రాన్ని పఠించాలి). "ఓం శ్రీ శ్రీ మహాలక్ష్మియే నమః " అనే మంత్రాన్ని జపిస్తూ అక్షింతలను అమ్మవారిపై వేయాలి. అలాగే కుంకుమతో కూడా అర్చించాలి. అలా అమ్మవారి పాదాల చెంతకు చేరిన కుంకుమను పెళ్ళైన మహిళలు నుదుటన పెట్టుకోవాలి.

ఇలా చేయడం వలన  అమ్మవారు మనకు ఐదవతనాన్ని పరిపూర్ణంగా ప్రసాదిస్తుందని ఒక ప్రఘాడ విశ్వాసం. అలాగే అక్షింతలను ఈ శ్రావణ మాసంలో  ప్రతి రోజు నిత్య పూజ అయిన అనంతరం ఆ అక్షింతలను మీ భర్త చేతికి ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. ఇలా చేయడం వలన మీ పసుపుకుంకుమలు అమ్మవారి ఆశీస్సులతో చల్లగా ఉంటాయి. ఈ విధంగా ఈ రోజున అమ్మవారిని పూజించుకునేటప్పుడు మనం ఈరోజు ఇలా స్వేచ్ఛగా మనకు నచ్చినట్లుగా పూజలు  పురస్కారాలు చేసుకోగలుగుతున్నాము. కావున నేడు అలాంటి మహానుభవములను పూజించుకునే రోజు కాబట్టి వారందరిని పూజలో భాగంగా స్మరించుకోండి. నేడు స్వతంత్రంగా బ్రతకగలుగుతున్నామంటే వారి చేసిన పోరాటాలే కారణం.  

మరింత సమాచారం తెలుసుకోండి: