ఈ చిత్రంలో రామ్ చరణ్ గ్రామీణ క్రీడాకారుడిగా కనిపించబోతున్నారు. ఇలా ఒక వైపు సినిమాకు సంబంధించి అప్డేట్స్ విషయంలోనే కాకుండా ఇప్పుడు మరొక విషయం వైరల్ గా మారుతోంది. అదేమిటంటే ఇందులో ప్రముఖ సీనియర్ హీరోయిన్ శోభన కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు వినిపిస్తోంది. పెద్ది సినిమా మొత్తం ఉత్తరాంధ్ర నేపథ్యంలో కొనసాగబోతోంది. ఇందులో శోభన కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారనే విధంగా వినిపిస్తున్నాయి. ఈమె పాత్ర సినిమాకే కీలకంగా ఉంటుందని సమాచారం. పెద్ది సినిమాని వచ్చే ఏడాది మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో కీలకమైన పాత్రలో కన్నడ హీరో శివరాజ్ కుమార్ కూడా నటిస్తున్నారు.
ఇటీవల హైదరాబాదులో జరిగిన మ్యూజికల్ కాన్సర్ట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ ఏఆర్ రెహమాన్ గారితో సినిమా చేయడం నా చిన్నప్పటి నుంచి కలగా ఉండేది, ఆ అవకాశం ఇప్పుడు పెద్ది సినిమాతో రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. రామ్ చరణ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారాయి. సినిమా టీజర్, ట్రైలర్ తో ఏ విధంగా పెద్ది సినిమా పైన అంచనాలను పెంచేస్తాయో చూడాలి మరి. పెద్ది సినిమా అయిపోయిన తర్వాత డైరెక్టర్ సుకుమార్ తో తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారు రామ్ చరణ్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి