మ్యూజికల్ ఫౌంటెన్..!  ఆ  సౌండే వేరన్నా

తిరుమల తిరపతి దేవస్థానం (టిటిడి)\తిరుమల గిరులలోని ప్రతి కూడలి లోనూ మ్యూజికల్ ఫౌంటెన్ ఏేర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనిపై దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.ఎస్. జవహర్ రెడ్డి తన సిబ్బందికి అదేశాలు ఇచ్చారు. తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ ప్రాంగ‌ణాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ వనాన్ని స‌ర్వాంగ‌సుంద‌రంగ తీర్చిదిద్ధాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. తిరుమలలోని ఉద్యాన‌వ‌నాల్లో భ‌క్తుల‌కు మ‌రింత అహ్లాద‌క‌రంగా ఉండేందుకు వాట‌ర్ ఫౌంటేన్లు ఏర్పాటు చేయాల‌ని సూచించారు. ఎక్కడ ఖాళి ప్ర‌దేశా లున్నా, అక్కడ ప‌చ్చ‌ద‌నాన్ని పెంపొందించా లని చెప్పారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 వ‌ద్ద మ్యూజిక‌ల్ వాట‌ర్ ఫౌంటేన్ అత్యంత వేగంగా ఏర్పాటు చేయాల‌ న్నారు. అంత‌కుముందు జవహర్ రెడ్డి క్యూలైన్లు, షెల్ట‌ర్‌ల‌ను ప‌రిశీలించారు. అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.
నమూనా అశ్వాలు, వృషభాలు, ఏనుగులు
       తిరుమల శ్రీ వేంకటేశ్వరుని బ్ర‌హ్మోత్స‌వాల్లో  ఏనుగులు, అశ్వాలు, వృషభాలు,బ్ర‌హ్మ‌ర‌థం దే అగ్ర‌స్థానం. కానీ ఏడాది కూడా ముచ్చటగా మూడోసారి  కోవిడ్ - 19 కార‌ణంగా సేవలు ఏకాంతంగా జరుగుతున్నాయి. ఆల‌యంలోని క‌ల్యాణ‌మండ‌పానికే స్వామి వారు పరిమితమయ్యారు.దీంతో టిటిడి సిబ్బంది నమూనా అశ్వాలు, వృషభాలు, ఏనుగులను కళ్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసింది. వీటికి తోడు ప్రత్యేక సెట్టింగులు కూడా ఆకర్షణగా నిలుస్తున్నాయి. శుక్రవారం మలయప్ప స్వామి కల్యాణ మండపంలో గీతా కృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శన మిచ్చారు. ఐదు తలల చిన్న శేషవాహనం పై పిల్లనగ్రోవిని చేత పట్టుకుని నెమలి పింఛం ధరించి  భక్తులకు అభయమిచ్చారు. ఈ చిన్న శేష వాహనాన్ని దర్శించిన వారికి కుండలిని యోగం సిద్ధించడం తో పాటు , కుటుంబ శ్రేయస్సుమెరుగవుతుందని  తిరుమల తిరుపతి దేవస్థానం పురాణ పండితులు ఈ సందర్భంగా  తెలిపారు.    ఈ కార్యక్రమంలో  పెద్ద‌జీయ‌ర్‌స్వామి,  చిన్న‌జీయ‌ర్‌స్వామి, టిటిడి ఛైర్మ‌న్   వై.వి.సుబ్బారెడ్డి దంప‌తులు, ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు ప్ర‌శాంతి రెడ్డి, స‌న‌త్‌కుమార్‌, అద‌న‌పు ఈవో దంప‌తులు,    పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: