తాజాగా ఓ రచయిత మరణం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది. ముఖ్యంగా ఆ రచయిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. మరి ఇంతకీ ఆ రచయిత ఎవరయ్యా అంటే బొగ్గుల శ్రీనివాస్.. రచయిత, యూట్యూబర్ అయినటువంటి బొగ్గుల శ్రీనివాస్ వెళ్తున్న కారు నిన్న ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయంలోకి దూసుకెళ్లింది.. అయితే కారులో వెనక కూర్చున్న బొగ్గుల శ్రీనివాస్ మృతి చెంది ముందు  కూర్చున్న డ్రైవర్ మాత్రం పరారవ్వడంతో ఆయన మరణం పై పలు అనుమానాలు వ్యక్తం చేశారు పోలీసులు.ఆయన మృతిని అనుమానాస్పద మృతిగా తేల్చేశారు. మరి ఇంతకీ బొగ్గుల శ్రీనివాస్ ఎవరు.. ఆయన గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

 2014లో జరిగిన సార్వత్రిక ఎలక్షన్స్ సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయంపై విమర్శలు చేస్తూ ఓ రచయిత రాసిన బుక్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయనే బొగ్గుల శ్రీనివాస్.. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ "పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో" అనే పుస్తకాన్ని రాశారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ నిజమైన లీడర్ కాదని,రీల్ బెంగాల్ టైగర్ అని విమర్శిస్తూ ఆ పుస్తకంలో రాయడంతో అప్పట్లో ఈ పుస్తకం రచయిత బొగ్గుల శ్రీనివాస్ చర్చనీయాంశంగా మారారు. దాంతో రచయిత బొగ్గుల శ్రీనివాస్ ని అప్పట్లో పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ బుక్ ప్రచురించిన బొగ్గుల శ్రీనివాస్ నిన్న అనుమానాస్పదంగా మృతి చెందడంతో ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

రచయిత బొగ్గుల శ్రీనివాస్ నిన్న అనగా శనివారం ఉదయం కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఖమ్మంలోని కూసుమంచి వద్ద ఉన్న పాలేరు రిజర్వాయర్ లోకి ఆయన కారు చొచ్చుకొని వెళ్ళింది. అయితే స్థానికులు చెప్పిన ప్రకారం వెనక సీట్ లో ఉన్న బొగ్గుల శ్రీనివాస్ నీట్లో మునిగి చనిపోయాడని అన్నారు. కానీ పోలీసులు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ముందు సీట్లో ఉండే డ్రైవర్ ఎలా తప్పించుకొని పారిపోతాడని,వెనుక సీట్ లో ఉన్న రచయిత మాత్రం ఎలా మునిగిపోతాడని అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం డ్రైవర్ పరారీలో ఉండడంతో ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక డ్రైవర్ దొరికితే బొగ్గుల శ్రీనివాస్ మరణం గురించి అసలు విషయాలు బయటపడతాయి అని అంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: