మన భారతదేశంలో మనం ఎక్కువగా ముహూర్తాలు, తిధులు, నక్షత్రాలు, ఇలాంటి వాటిని ఎక్కువగా నమ్ముతాము ఆచరిస్తాం. ఇందులో భాగంగానే మనం పుట్టిన తేదీని బట్టి కూడా మన జీవితం ఎలా ఉండబోతుందో చెప్పే అటువంటి  జ్యోతిష్య నిపుణులు కూడా ఉన్నారు. మరి ఏ నెలలో పుడితే వారి యొక్క జీవితం, ప్రేమ బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..! జనవరి నెల నుంచి డిసెంబర్ నెల వరకు ఒక్కొక్క నెలలో పుట్టిన వారికి ఒక్కొక్క విధంగా లవ్ లైవ్ ఉంటుందని న్యూమరాలజీ తెలియజేస్తోంది. జనవరిలో పుట్టిన వారికి ప్రేమ విషయంలో చాలా సిన్సియర్ గా ఉంటారు. ధైర్యం కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఫిబ్రవరిలో పుట్టిన వారు ప్రేమలో చాలా సిన్సియర్ గా ఉంటారు. కానీ వాళ్ల లవ్ విషయాన్ని మరొకరికి చెప్పరు.

 వీరు చాలా రొమాంటిక్ గా ఉండి లోతుగా  ఆలోచన చేస్తారు. ఇక మార్చి నెలలో పుట్టిన వాళ్ళు లవ్ చేస్తే మాత్రం ఎక్కువగా ట్రావెల్ చేయాలని భావిస్తారు. ఒక్కోసారి చేదు అనుభవాలు కూడా ఎదురవుతాయి జాగ్రత్త. ఏప్రిల్ లో పుట్టిన వారు మాత్రం ప్రేమ విషయంలో మాత్రం ఎప్పుడూ స్నేహితుల సలహాలు మాత్రమే తీసుకుంటారు. వారి ఏది చెప్తే దాన్ని బట్టి ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తారు. మీరు ప్రేమలో ఎదురుదెబ్బలు కూడా తింటారు. మే నెలలో పుట్టిన వారు ఎవరిని తొందరగా ఇష్టపడరు. కానీ ఒకసారి ప్రేమలో పడితే చచ్చినా వారిని విడిచిపెట్టారు. వీరి లవ్ కంటే కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇక జూన్లో పుట్టినవారైతే వీరికి అసూయ ఎక్కువగా ఉంటుంది. వీరి ప్రేమ లో కూడా స్వార్ధం కనిపిస్తుంది. ఒక్కసారి హర్ట్ అయితే వాళ్లు మళ్లీ మామూలు కావడానికి చాలా టైం పడుతుంది. ఇక జులై నెలలో పుట్టిన వారు జూన్ నెలలో పుట్టిన వారి లాగే ఒక్కసారి వారు హట్ అయితే మాత్రం వాళ్లు రికవరీ కావడానికి చాలా టైం పడుతుంది. కానీ వీరికి జాలి ఉంటుంది. దయ ఉంటుంది.

ఇక ఆగస్టు నెలలో పుట్టిన వారి లవ్ లైఫ్ అయితే వారి యొక్క ప్రేమతో ఎదుటి వారిని కూడాకంట్రోల్లో ఉంచగలరు. పుట్టిన వారు ఎవరినైనా ప్రేమిస్తే వాళ్లను అస్సలు వదులుకోరు. ఇక సెప్టెంబర్ లో పుట్టిన వారు లవ్ ఫెయిల్ అయితే మాత్రం చాలా డిప్రెషన్ కు వెళ్లే అవకాశం ఉంది. అలాగే అక్టోబర్ లో పుట్టిన వారు అందరినీ ఈక్వల్ గానే ప్రేమిస్తూ ఉంటారు. ఒకరి మీద అంటూ ఎఫెక్షన్ పెట్టుకోరు. అందరినీ ప్రేమిస్తారు అందరి నుంచి ఆ ప్రేమను కోరుకుంటారు. ఇక నవంబర్ లో పుట్టిన వారికి మాత్రం వారి యొక్క ప్రేమతోనే ఎదుటి వారిని కంట్రోల్ చేస్తూ, ఈ నెలలో పుట్టిన అమ్మాయిలు అయితే వాళ్ల భర్తలను చిటికెన వేలితో ఆడిస్తూ ఉంటాడు అంటే భర్తలను పూర్తిగా కంట్రోల్ లో పెడతారు. డిసెంబర్లో పుట్టినవారైతే వీరికి పూర్తిగా ప్రేమించే గుణం ఉండదు. ప్రేమించినట్టు నటిస్తాడు కానీ, పొగడ్తలకు లొంగిపోతారు. ఈవిధంగా ఒక్కొక్క నెలలో పుట్టిన వారి లవ్ లైవ్ ఒక్కొక్క విధంగా ఉంటుందని సంఖ్యాశాస్త్ర పరంగా మనం తెలుసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: