ఈ కలియుగంలో మంచి చెడు అనేది రెండు ఉంటాయి. భగవంతుడు మనకు ఏదైతే చెడును సృష్టించాడో, ఆ విధంగానే మంచిది కూడా సృష్టించాడు. ఒకవేళ చెడు చేసినా  దానికి సంబంధించిన పరిహారాన్ని కూడా సూచించి పెట్టాడు. చాలా మంది జీవితంలో ఎంత సంపాదించినా, ఎంత కష్టపడినా వారికి అదృష్టమనేది కలిసిరాదు. దీనికి కొన్ని కారణాలు ఉంటాయి. ముఖ్యంగా నవగ్రహాల, దుష్ట గ్రహాల సమస్యలు ఏవైనా సరే, అదేవిధంగా హోమ క్రియ, మంత్ర, తంత్ర, యంత్రాలు ఇలాంటి వాటికి కూడా పరిహారం అనేది భగవంతుడు సృష్టించి పెట్టాడు. ముఖ్యంగా 12 రాశుల వారిలో చాలామందికి నాగదోషం అనేది ఉంటుంది.

ఈ నాగదోషంలో అనేక రకాలు ఉన్నాయి. కర్కోటస నాగదోషం, శంఖపాల, ఇలా పన్నెండు రకాల నాగ దోషాలు ఉంటాయి. ఎన్ని దోషాలున్నా వాటికి పరిహారాలు మాత్రం తప్పనిసరిగా ఉన్నాయి. ఇలా ఈ దోషాలు ఉన్నప్పుడు కళ్యాణం కాకపోవడం, ఆర్థిక సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మన జాతకంలో ముఖ్యంగా రాహు ప్రాబ్లం ఉంటే ఈ నాగ దోషం అనేది  తప్పకుండా ఉంటుంది. మరి ఇలాంటి దోషాలకు పరిహారం ఏంటో తెలుసుకుందామా..! వెండి తాయతులు గాని, రాగి తాయత్తులు గాని తీసుకొని మంగళవారం లేదా ఆదివారం ఏదైనా మంచి రోజు చూసుకొని రెండు రాగి చెంబులు తీసుకొని ఒక చెంబులో నీళ్లు మరొక చెంబులో  పాలు తీసుకొని ఒక పుట్ట దగ్గరకు వెళ్లి చెంబులో నీళ్ళు చల్లి పసుపు కుంకుమ వేసి అగరవత్తులు దీపం వెలిగించండి. మీరు తెచ్చిన పాలు ఏవైతే ఉన్నాయో మీ గోత్రనామాలు తలుచుకుంటూ మీ సమస్యను తలుచుకుంటూ ఆ పాలను పుట్టలో పోయండి.

 ఆ తర్వాత ఆ పుట్ట చుట్టూ 16 ప్రదక్షిణలు నాగదేవతను తలుచుకుంటూ చేయండి. పూర్తయిన తర్వాత మంచిగా నీ మనసులో ఉన్న ఈ విషయాన్ని చెబుతూ దండం పెట్టండి. ఆ తర్వాత ఆ పుట్ట దగ్గర నుంచి మనం పసుపు కుంకుమ వేసిన దగ్గర  కొద్దిగా మట్టిని తీసుకొని, మనం తీసుకుపోయిన తాయత్తులు అక్కడే నింపి దాని మూత పెట్టి, అక్కడ ఉన్న అగరొత్తుల పొగ చూపించి మెడలో వేసుకోండి. అది వేసుకున్న 16 రోజుల తర్వాత మీరు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుందని వాస్తు, జ్యోతిష్య  పండితులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: