శివుడు ఆజ్ఞలేదే చీమైనా కుట్టదని పెద్దలు చెబుతూ ఉంటారు.మన జీవితంలో ఏమి జరగలాన్నా, జరగకూడదన్నా ఆయన ఆజ్ఞ ఉండాల్సిందే.అంతటి శక్తి గల శివున్ని కొన్ని రకాల ఆకులతో పూజించడం వల్ల మన జీవితంలో ఒడిదుడుకులు,ఉద్యోగం రాకపోవడం, వ్యాపార నష్టాలు మొదలుగునవి తొందరగా తగ్గుముఖం పడతాయని కొన్ని పురాణాలూ చెబుతున్నాయి.ఆ పరమశివుడి ప్రసన్నం కోసం ఉపయోగపడే ఆకులేంటి, వాటి వల్ల ఎలాంటి సమస్యలకు విరుగుడు దొరుకుతుందో తెలుసుకుందామా..

తులసి ఆకు..

పురాణాల్లో కూడా తులసి ఆకుల గురించి ప్రస్తావన ఉంది.ఈ ఆకులతో శివుణ్ణి తరచుగా పూజలో ఉపయోగించడంతో, ఆ శివుడి అనుగ్రహం కలిగి దుఃఖం, దురదృష్టాలు ఉండవని వేద పండితులు చెబుతున్నారు.హిందూ సంప్రదాయంలో,ఇల్లు లేదా స్థలాన్ని శుద్ధి చేయడానికి తులసిని నీటిని చల్లుకోవడం వల్ల మంచి జరుగుతుందని భావిస్తారు.

బిల్వ ఆకు..

బిల్వ మొక్క మరియు దాని ఆకులు పవిత్రత గురించి కూడా పురాణాల్లో ప్రస్తావన ఉంది.ఈ ఆకు ఆ మహాదేవునికి ముడిపడి ఉన్న ఆకు కావున హిందూ మతంలో చాలా శుభకరమైనదనిగా పరిగణించబడుతుంది.ఈ ఆకులను బిల్వ పత్రే అని కూడా సంబోధిస్తారు.దీని పండు లేదా ఆకు రూపంలో శివునికి ప్రతి దీని ద్వారా మీకు త్వరలో పరశివుని అనుగ్రహం లభిస్తుంది.


శమీఆకు..

శమీ ఆకులను కూడా శివునికి ఎంతో ప్రీతికరమైనది. హిందూ పురాణాల ప్రకారం,బిల్వ ఆకులతో పూజించడం కంటే,ఆ పరమేశ్వరునికి శమీ ఆకులను సమర్పించడంతో చాలా రెట్లు పుణ్యఫలం దక్కుతుందని చెబుతారు.శివునికే కాక శమీ ఆకులను శివుని పెద్ద కుమారుడైన విఘ్నేశ్వరుడికి మరియు కష్టాలను తొలగించే,శని దేవునికి సమర్పించడంతో కూడా సర్వ సమస్యలు తొలగుతాయి.


తమలపాకు..

సనాతన సంప్రదాయంలో తమలపాకు ఎంతో పవిత్రమైన స్థానం ఉంది.అందుకే  దీనిని ఏ దేవతామూర్తుల పూజలు చేసినా కచ్చితంగా సమర్పిస్తారు.తమలపాకులతో శివుని అభిషేకించడం ద్వారా,మన ఇంట్లో ఉన్న అశాంతి తొలగి,సర్వసంపదలు కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు.

జిల్లెడ ఆకులు..

అన్ని ఆకులు కంటే జిల్లెడు ఆకులు అంటేనే శివునికి ఎంతో ప్రీతికరమైనవి.జిల్లేడు పువ్వులు కానీ,జిల్లెడు చెట్టు కానీ శివునికి ప్రతిరూపంగా చెబుతూ ఉంటారు. ఇలాంటి జిల్లడ ఆకులతో శివుని పూజించడం వల్ల శివుని అనుగ్రహం తొందరగా లభించే సర్వసంపదలు కలుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: