మన హిందూ సాంప్రదాయంలో రాగి చెంబుకు చాలా ప్రాముఖ్యత ఉంది.చాలామంది రాగి చెంబును కలశం పెట్టేటప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.ఇది ట్రెడిషన్లో ఎంత ముఖ్యపాత్ర వహిస్తుందో ఆరోగ్యాన్ని ఇవ్వడంలో కూడా అంతే ముఖ్యపాత్ర వహిస్తుంది. ఆరోగ్య సమస్యలతో కానీ డబ్బు సమస్యలతో కానీ శత్రు సమస్యలతో కానీ బాధపడే వారికి రాగి చెంబుతో చేసే నివారణలు చాలా బాగా సహాయపడతాయి.మీరు కూడా మీ కుటుంబాన్ని అష్టైశ్వర్యాలు కలిగించుకోవాలి అంటే రాగి చెంబును ప్రత్యేక స్థానంలో ఉంచాలని వేద పండితులు సూచిస్తూ ఉన్నారు.ఆ స్థానం ఏంటో తెలుసుకుందామా మరి.

ఈ నివారణ కోసం అష్టలక్ష్ములు కలిగిన రాగి చెంబును తీసుకుని బాగా శుభ్రం చేసి,పసుపు రాయాలి.ఆ తర్వాత ఒక్కో లక్ష్మికి ఒక్కోసారి కుంకుమ బొట్టు పెట్టాలి. ఒక పసుపు దారానికి తమలపాకును చుట్టి రాగి చెంబుకు కట్టాలి.ఇప్పుడు ఈ రాగి చెంబుకు పూలతో అలంకరించాలి.ఇలా అలంకరించిన రాగి చెంబును ఈశాన్యం వైపు ఒక విస్తరాకు వేసి,పసుపుతో ముగ్గు వేయాలి.ఇప్పుడు గుప్పెడు బియ్యం వేసి అలంకరించిన రాగి చెంబును,నీటితో నింపి పెట్టాలి.ఈ నివారణను ప్రతి శుక్రవారం  పాటించాలి.ఈ రాగి చెంబులో నిల్వ చేసిన నీటిని మరుసటి రోజున ఎవరు తొక్కని ప్రదేశాల్లో కానీ,తులసి చెట్టు మొదల్లో కానీ వేయాలి.ఇలా తొమ్మిది శుక్రవారం పాటు చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న అష్ట దరిద్రాలు వెళ్లిపోయి,అష్టలక్ష్ములు మన ఇంట్లోకి అడుగు పెడతారు.దీనితో ఇంట్లో ఉన్న ఆరోగ్య సమస్యలు, కుటుంబ గొడవలు,చికాకులు,ఆర్థిక సమస్యలు,ఉద్యోగ సమస్యలు వాటికి నివారణ కలుగుతుంది.మరియు కుటుంబం అభివృద్ధిలోకి కుటుంబ సభ్యులు పేరు ప్రతిష్టలు పొందుతారు.

ఈ నివారణ పాటించడం కంటే ముందు ఎవరైతే అష్టలక్ష్మిలతో ఇంటిని తులతూగాలని కోరుకుంటూ ఉంటారో అటువంటివారు దానధర్మాలు చేయడం, స్త్రీలను గౌరవించడం,వృద్ధులను సరైన పోషణ కలిగించడం వంటివి వల్ల కూడా సుఖశాంతుల కలుగుతాయి.కావున ఈ నివారణ పాటించి వెంటనే మీ కష్టాలకు నివృత్తి కలిగించుకోండి.


మరింత సమాచారం తెలుసుకోండి: