చాలామంది దేవుళ్ళకి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు . మరి ముఖ్యంగా కొంతమంది ప్రతి రోజు కూడా దేవుడి పటాలను పసుపు కుంకుమతో పూజిస్తూ రకరకాల పువ్వులతో అలంకరిస్తూ ఉంటారు . పువ్వులు అలంకరిస్తే వచ్చే వైబ్స్ వేరే లెవెల్ లో ఉంటాయి . ప్రతి శుభకార్యం లోనూ శుభ సూచికగా పూలను ఉపయోగిస్తూ ఉంటారు.  మరీ ముఖ్యంగా శుక్రవారం అయితే దేవుడి పటాలకు పూలతో చాలా ఆకర్షణీయంగా అలంకరిస్తూ ఉంటారు మహిళలు . కాగా ఆ పువ్వులు ఎక్కువ రోజులు తాజాగా ఉండవు అది అందరికీ తెలుసు . బయటపడితే త్వరగా వాడి పోతాయి . ఆ కారణంగానే చాలామంది ఇళ్లల్లో ఫ్రిజ్లో ఉంచుతారు.


ఎందుకంటే బయట ఉంచితే పువ్వులు వెంటనే వాడిపోతాయి.. ఫ్రెష్ గా ఉండవు. దేవుడికి పెట్టిన ఆ లుక్ రాదు. ఆ కారణంగానే మహిళలు ఎక్కువగా పూలు కొనుక్కొని ఫ్రిజ్లో పెట్టుకొని నాలుగు రోజులు వాడుకుంటూ ఉంటారు.  అయితే అలా ఫ్రిజ్లో ఉంచిన పువ్వులను దేవుడికి ఉపయోగించవచ్చా..? దేవుడిని పూజించడానికి ఉపయోగించడానికి వాడొచ్చా..? ఈ విషయంపై నిపుణులు ఏం చెప్తున్నారు ఇప్పుడు తెలుసుకుందాం..!



మనం సాధారణంగా పూజ కోసం పూలను ఇంటి మొక్కల నుండి లేదా మార్కెట్ నుండి తెస్తాము. అయితే ఈ పువ్వులను ఎన్ని రోజులు పెట్టి పూజించాలి..? ఫ్రిజ్లో ఉంచిన పూలను దేవుడికి పూజించడం కరెక్టేనా ..? అని చాలామంది గందరగోళంలో ఉంటారు . కానీ చాలామంది పండితులు అలా ఉపయోగించకూడదని చెబుతున్నారు.  ఫ్రిజ్లో మనం రకరకాల ఫుడ్ ఐటమ్స్ స్టోర్ చేస్తుంటాం.  అలాగే కొన్నిసార్లు కోడిగుడ్లు - మాంసాహార పదార్థాలు రకరకాలవి స్టోర్ చేసి ఉంటాం. అదే ఫ్రిజ్లో దేవుడికి ఎంతో పవిత్రంగా ఉపయోగించి పువ్వులను కూడా స్టోర్ చేసి ఆ తర్వాత ఆ పువ్వులను దేవుడికి అలంకరించి పూజిస్తే ఆ పుణ్యఫలం దక్కనే దక్కదు అంటున్నారు పండితులు .



అలాంటి పూలతో దేవుడిని పూజిస్తే ఫలితాలు శూన్యం అంటూ చెప్పుకొస్తున్నారు.  ఫ్రిజ్లో ఉంచిన పూలను కేవలం వివాహ కార్యక్రమాలకు లేదా మనల్ని అలంకరించుకోవడానికి మాత్రమే ఉపయోగించుకోవాలి అని .. దేవుడికి మాత్రం అసలు ఉపయోగించకూడదని హెచ్చరిస్తున్నారు . అంతేకాదు అప్పటికప్పుడు ఫ్రెష్ గా తెచ్చిన పూలను దేవుడు కలంకరించాలి.  లేదా మన ఇంటి పెరటిలో ఉన్న మొక్కలకి ఉన్న పువ్వులను దేవుడికి పెట్టి అలంకరించాలి . ఇలా కానిపక్షంలో ఇంట్లో తెల్లటి వస్త్రంలో ఉంచి ఆ పువ్వులపై నీళ్లు చల్లుతూ ఉంటే ఒక రెండు రోజుల వరకు స్వచ్ఛంగా ఫ్రెష్ గా ఉంటాయి . ఈ విధంగా ఉంచిన పువ్వులను దేవుడికి ఉపయోగించవచ్చు . అంతేకానీ మనం మాంసాహార పదార్థాలను స్టోర్ చేసుకునేటప్పుడు అదే విధంగా కోడిగుడ్లు స్టోర్ చేసుకున్న దగ్గర పువ్వులను పెట్టి ఆ పువ్వులను దేవుడికి ఉపయోగించడం మహా మహా పాపం  అంటున్నారు పండితులు..!!



నోట్: ఇక్కడ అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఒక్కొక్కరి మత విశ్వాసాల బట్టి ఆ నమ్మకం ఉంటుంది.  ఇది పాఠకులు గుర్తుంచుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: