కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తులు తరలివస్తూ ఉంటారు . నిత్యం వేలాది సంఖ్యలో భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు . ఆయన ను దర్శించుకుని  మొక్కుకున్న మొక్కులు తీర్చేస్తే.. సకల పాపాలు హరించి పోతాయి అనే నమ్మకం భక్తులకి ఎప్పటినుంచో ఉంది.  ఈ క్రమంలోనే కొందరు భక్తులు కాలినడకన కూడా ఏడుకొండలు ఎక్కి తమ మొక్కులను . ముడుపులను స్వామివారికి చెల్లించుకుని దర్శనం చేసుకుంటూ ఉంటారు . శ్రీవారి సన్నిధి నిత్యం భక్తులతో ఎప్పుడు కిటకిటలాడిపోతూ ఉంటుంది .


సీజన్ అనేటివి లేకుండా సంవత్సరంలో 365 రోజులు 24 గంటలు ఎప్పుడు కూడా  తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు ఉత్సాహం చూపుతూ ఉంటారు . అయితే శ్రీవారి దర్శన టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది.  ఆన్లైన్లో గంటల వ్యవధిలోని లక్షలాది టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోతూ ఉంటాయి. ఇకపోతే ఆగస్టులో తిరుపతి ట్రిప్ ప్లాన్ చేయాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు.  శ్రావణమాసం పైగా ఈసారి వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చే  అవకాశం ఉంది . ఆ కారణంగా చాలామంది ఆగస్టులో శ్రీవారిని దర్శించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు .కానీ టికెట్లు మాత్రం దొరకవు . టికెట్లు దొరకక శ్రీవారి ట్రిప్ ను వాయిదా వేసుకోవాలి అనుకునే వారికి తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ అందించింది . 300 టికెట్లు దొరకకపోయినా పర్వాలేదు . ఒక మార్గంలో ప్రయత్నిస్తే ఖచ్చితంగా స్వామివారిని దర్శించుకోవచ్చు అంటూ టీటీడీ తెలిపింది.  దాని వివరాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!



శ్రీ శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమం :

ఈ ఏడాది జులై 25న ఉదయం 10 గంటలకు టీటీడీ తన అధికారిక వెబ్ సైట్ లో శ్రీ శ్రీనివాస దివ్య అనుగ్రహం హోమం పేరిట టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది . ఇందులో ఒక టికెట్ ఖరీదు 1600 ఉంటుంది . ఒక టికెట్ పై ఇద్దరు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది . టికెట్ బుక్ చేసుకున్న రోజున ఉదయం 9 గంటల లోపే అలిపిరికి చేరుకొని అక్కడ ఉన్న సప్త గృహ దగ్గర రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది . సుమారు 11 లోపు హోమం పూర్తయిపోతుంది.  ఇక ఆ తర్వాత అదే రోజున మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో 300 రూపాయల క్యూ లైన్ ద్వారా శ్రీవారిని దర్శించుకునే వెసులుబాటు కల్పిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం . ఎవరైతే 300 టికెట్లు బుక్ అవ్వలేదు అని బాధపడుతున్నారో.. శ్రీవారిని దర్శించుకోలేకపోయాం అన్న కారణంగా ఫీల్ అవుతున్నారో అలాంటి వాళ్లకి ఇది ఉత్తమమైన మార్గం అంటున్నారు భక్తులు.  టిక్కెట్ ఖరీదు కొంచెం ఎక్కువే అయినా  శ్రీవారి ముందు అన్ని తక్కువగానే చూస్తూ ఉంటారు భక్తులు . కుటుంబ సమేతంగా ఎవరైనా సరే శ్రీవారిని దర్శించుకోవాలి అని ప్లాన్ చేసుకునే వాళ్ళు ఈ శ్రీ శ్రీనివాస దివ్య అనుగ్రహం హోమం ద్వారా వెళితే ఈజీగా దర్శనం అయిపోతుంది అంటూ టీటీడీ వాళ్లు చెప్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: