క్రికెట్  సెలెక్టర్లు టీం మొత్తం ముందుండి నడిపించే ఆటగాన్ని జట్టు సారధిగా  ఎంచుకుంటారు అన్న విషయం తెలిసిందే.  జట్టుకు సారథి ముందుండి నడిపించే ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా... తనదైన వ్యూహాలతో మంచి విజయాలను అందించాలని సెలెక్టర్లు క్యాప్టెన్ ఎంచుకుంటారు. కానీ ఆ జట్టు కి కెప్టెనే మైనస్ అయినప్పుడు... ఆ కెప్టెన్ ద్వారా జట్టు వరుస పరాజయాలు చవి చూసి నప్పుడు... జట్టు కెప్టెన్ ని మార్చడం తప్పక జరగాల్సిందే. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ జట్టులో అదే జరిగింది. గత కొంతకాలంగా పాకిస్థాన్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న సర్ఫరాజ్ మొహమ్మద్ సారథ్యంలో జట్టు గత కొంతకాలంగా పేలవ ప్రదర్శన చేస్తోంది. ప్రత్యర్థి ఎవరైనా పేలవ  ప్రదర్శన చేస్తూ... వరుస ఓటముల చవిచూస్తుంది పాకిస్తాన్ జట్టు. 

 


 పాకిస్థాన్ జట్టును ముందుండి నడిపించడంలో.... విజయ తీరాలకు చేర్చడంలో పాకిస్తాన్ జట్టు సారథి సర్ఫరాజ్ మహమ్మద్ విఫలమయ్యాడనే చెప్పాలి. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ మహమ్మద్ తొలగించి పాకిస్థాన్కు కొత్త క్యాప్టెన్ నియమించాలని పాకిస్తాన్ టీం సెలక్షన్ కమిటీ భావించింది. పాకిస్తాన్ జట్టు సారథ్య బాధ్యతల నుంచి సర్ఫరాజ్ మహమ్మదు తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. మొన్న జరిగిన ప్రపంచకప్ లో కూడా పాకిస్థాన్ జట్టును ముందుండి నడిపించడంలో కెప్టెన్ సర్ఫరాజ్  విషయం తెలిసిందే. ఏకంగా ఉత్కంఠగా మ్యాచ్  జరుగుతున్న సమయంలో కూడా... జట్టు కెప్టెన్ ఐనా సర్ఫరాజ్ మహమ్మద్... నిద్రమత్తులో ఫీల్డింగ్  చేయడం లాంటివి పలు విమర్శలకు కూడా దారితీసాయి. ఈ నేపథ్యంలోనే సర్ఫరాజ్ మహామ్మద్  జట్టు కెప్టెన్గా తొలగించాలని పాకిస్తాన్ సెలక్షన్ కమిటీ భావించినట్లు తెలుస్తోంది. 

 

 ఈరోజు వరకు జట్టు సారథిగా కొనసాగిన  సర్ఫరాజ్ మహమ్మద్ కు భారీ షాక్ తగిలినట్లయింది . వన్డే ప్రపంచకప్ కప్ లో పేలవ   ప్రదర్శన చేసి పాకిస్తాన్ ఓడిపోవడంతో కెప్టెన్ గా ఉన్న సర్ఫరాజ్ మహమ్మద్ ను టి20 టేస్ట్  మ్యాచ్ల నుంచి కెప్టెన్గా తొలగించారు. ఇక తాజాగా వన్డే క్రికెట్ మ్యాచ్ ల  నుండి సర్ఫరాజ్  ను కెప్టెన్గా తొలగించి ఆ స్థానంలో బాబార్ ఆజామ్ కు  సారథ్య బాధ్యతలను పాకిస్తాన్ సెలక్షన్ కమిటీ అప్పగించినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం పాకిస్థాన్ జట్టుకు టెస్టుల్లో అజార్... వన్డేల్లో  సర్ఫరాజ్ మహమ్మద్.. టి20లో బాబర్ కెప్టెన్ గా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: