క్రాఫ్ చేసుకున్నా స్టైల్ లే, టాట్ వేసుకున్నా విశేషమే చివరికి మోడల్ గా కనపడిన అభిమానులకు పిచ్చే. మొత్తానికి చెప్పాలంటే ఆయన ఓ మంచి క్రికెటరే కాదు. ఫ్యాషన్ కి ఐకాన్ అతను ఎవరో కాదు మన విరాట్ కోహ్లీ. అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిట్ల మీద హిట్లను తన ఖాతాలో వేసుకుంది. అందం, అభినయంతో అభిమానుల మనసును కొల్లగొట్టింది. ఒక్కరిది ఆట, మరొక్కరిది  నటన ఆ ఇరువురు ఒక్కటై అభిమానుల చూపులను వీరిపై తిప్పుకున్నారు. ఇంతకీ వీరి ప్రేమ ఎప్పుడు ఎక్కడ మొదలైంది? 

 

భారత క్రికెట్ ఆటగాడు కోహ్లీ అంటే తెలియని వారుండరేమో.. గల్లీ నుండి ఢిల్లీ దాకా ఈ కుర్రాడు తీసిన సెంచరీలు, కొట్టిన హెలికాఫ్టర్ షార్టులు అందరిని అబ్బురపరుస్తున్నాయి. క్రికెట్ లోనే కాకుండా స్టార్ గుర్తింపు తెచ్చుకున్న విరాట్ ఎన్నో వాణిజ్య ప్రకటనలలో నటిస్తున్నాడు. అలా బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మతో కలిసి హెడ్ అండ్ షోల్డర్ ప్రకటనలో నటించారు. అయితే అనుష్క శర్మని మొదటిసారి కలిసినప్పుడు విరాట్ కోహ్లీ మాత్రం చాలా ఒత్తిడికి గురయ్యాడట. ఆ యాడ్ కాస్త వారి ప్రేమకు తెర తీసింది. అలా ఆ ఇద్దరు ఎక్కడికి వెళ్లిన నీతోనే నేనుంటాను అన్నట్లు ఒకరి విడిచి ఒకరు ఉండలేక తిరిగారు.

 

2013లో షాంఫూ ప్రకటనలో నటించిన తర్వాత విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కొన్నాళ్లపాటు ఎవరికీ తెలియకుండా తమ ప్రేమాయణాన్ని కొనసాగించారు. కానీ.. హైదరాబాద్‌లో జరిగిన ఓ మ్యాచ్‌లో శతకం సాధించిన విరాట్ కోహ్లి.. గ్యాలరీలో కూర్చుని మ్యాచ్‌ని వీక్షిస్తున్న అనుష్కకి మైదానం నుంచే ప్లైయింగ్ కిస్‌ ఇవ్వడంతో వీరి లవ్‌స్టోరీ వెలుగులోకి వచ్చింది. దాదాపు నాలుగేళ్లు ప్రేమలో ఉన్న ఈ జంట 2017 ఆఖర్లో ఇటీలీ వేదికగా వివాహ బంధంతో ఒక్కటైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: