కరోనా పుణ్యమా అని క్రికెటర్ల అందరూ వారి ఇంటికే పరిమితమయ్యారు. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని క్రికెటర్లు అందరూ అప్పుడప్పుడు ఆన్లైన్ లోకి వచ్చి సందడి చేస్తున్నారు. ఇక మన టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండే కూడా లాక్ డౌన్ తో తాను కూడా ఇంట్లోనే తన కాబోయే భార్య నటాషా స్టాన్‌వికోవిచ్‌తో కలిసి సరదాగా గడుపుతున్నాడు. వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోలు వీడియోలను వారు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.


అయితే ఇక అసలు విషయానికి వస్తే... నటాషాకి హిందీ నేర్పిస్తున్న హార్థిక్ పాండే ఒక సరదా వీడియోను మంగళవారం ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు.  " బేబీ నేను నీకు ఏమి అవుతాను " అని అడగగా పాండ్యకి కాబోయే భార్య నటాషా దానికి వచ్చీరాని హిందీలో సమాధానం చెప్పుకొచ్చింది. ఇక నటాషా సమాధానంతో హార్దిక్ పాండే సిగ్గుపడుతూ ఉన్న ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కాగా ఈ ఏడాది మొదట్లో కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా దుబాయ్ కి వెళ్లిన ఈ టీమిండియా అల్ రౌండర్ అక్కడే సెర్బియా నటి నటాషా స్టాన్‌వికోవిచ్‌ ని నిశ్చితార్థం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: