ఇప్పటి వరకు  చాలామంది దిగ్గజ  ఆటగాళ్లు సైతం  ధోనీ ది బెస్ట్ కెప్టెన్ అని ఎన్నోసార్లు ఒప్పుకున్నా  విషయం తెలిసిందే. తాజాగా టీమిండియా స్టార్ ఓపెనర్ ఆయన శిఖర్ ధావన్ కూడా ఇదే చెప్పాడు.  భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అత్యుత్తమ క్యాప్టెన్ అంటూ ఒప్పుకున్నాడు. టీమిండియా మాజీ స్టార్ ప్లేయర్ అయిన ఇర్ఫాన్ పఠాన్ తో ఇంస్టాగ్రామ్ లైవ్ సెషన్ లో  పాల్గొన్న అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా కెప్టెన్ గురించి చర్చ వచ్చింది... ఈ క్రమంలోనే.. విరాట్ కోహ్లీ ధోనీ లలో ఎవరు బెస్ట్ కెప్టెన్ అనే ప్రస్తావన రాగా శిఖర్ ధావన్ ధోని కి ఓటు వేశారు. 

 

 

నా కెరీర్లో చాలా మ్యాచులు మహేంద్రసింగ్ ధోని విరాట్ కోహ్లీ కెప్టెన్సి లలో  ఆడానని కానీ తనకు ఎప్పటికీ బెస్ట్ కెప్టెన్ మాత్రం ధోని అంటూ చెప్పుకొచ్చారు శిఖర్ ధావన్. ఇదే సమయంలో తాను ఎదుర్కొన్న క్లిష్టమైన బౌలర్ ఎవరు అనే దానికి కూడా ఆసక్తికరంగా సమాధానం చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్  మిచెల్ స్టార్క్  తాను ఇప్పటివరకు ఎదుర్కొన్న క్లిష్టమైన బౌలర్ అంటు శిఖర్ ధావన్ వెల్లడించారు, వాస్తవానికి శిఖర్ ధావన్ ఏకంగా ఐదుగురు కెప్టెన్సీలో  ఆడాడు. అయిదేళ్లుగా కోహ్లీ కెప్టెన్సీలో  ఆడుతున్నారు శిఖర్ ధావన్. 

 

 

 అయినప్పటికీ  ధోనీ తన బెస్ట్ కెప్టెన్ అని చెప్పడం విశేషం. రెండేళ్ల క్రితం వరకు శిఖర్ ధావన్ టీం ఇండియా స్టార్ ఓపెనర్ గా ఉండగా...  రెండేళ్ల క్రితం నుంచి అతని కెరియర్  గాడి తప్పింది. 2019 వన్డే  ప్రపంచకప్లో గాయం కారణంగా టోర్నీ మధ్యలోనే వెనుదిరాగగా  తరువాత మోకాలి గాయం కారణంగా కీలక సిరీస్ లకు  సిరీస్కు దూరమయ్యాడు. శిఖర్ ధావన్ స్థానంలో స్థానం సంపాదించుకున్న కేఎల్ రాహుల్ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుని  అద్భుతంగా రాణించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: