ప్రస్తుత  టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పై ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు ఆల్ రౌండర్  ఇయాన్ బోథ‌మ్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత జట్టును మరిన్ని శిఖరాలకు చేరుస్తారని విరాట్ కోహ్లీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 2014 సంవత్సరం నుంచి భారత టెస్టు జట్టుకు, 2017 నుంచి పరిమిత క్రికెట్ కు విరాట్ కోహ్లీ నడిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన నుంచి సులువుగా లాగేసుకుంటాడని, అలాగే ఎప్పుడు అందరితో సరదాగా ఉంటూ మ్యాచ్ ను లాగేసుకుంటాడని ఆయన విరాట్ కోహ్లీ గురించి తెలిపాడు. 2008 సంవత్సరంలో అండర్-19 ప్రపంచ కప్ విరాట్ కోహ్లీ టీమిండియాకు అందించిన సంగతి అందరికీ తెలిసిందే.


ఇకపోతే అప్పటినుంచి విరాట్ కోహ్లీ తన నాయకత్వ లక్షణాలు రోజురోజుకీ పెంపొందించుకుని ఇండియాలో ఎనలేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారని ఆయన తెలిపాడు. నేను పోటీ పడితే విరాట్ కోహ్లీతో పోటీ పడాలని ఉందని తెలిపాడు. అంతేకాకుండా ప్రస్తుత టీమిండియా జట్టును కోహ్లీ మరింత ఎత్తుకు తీసుకెళ్లే సరైన వ్యక్తి అని ఆయన అభిప్రాయం తెలియ చేశాడు.  ఇకపోతే మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కంటే మెరుగైన ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అని తెలియజేశాడు. 2019 ప్రపంచ కప్ లో బెన్ స్టోక్స్ ప్రపంచం కప్ ను గెలుచుకోవడంలో ప్రముఖ పాత్ర వహించాడని ఆయన తెలిపాడు. అంతేకాకుండా బెన్ స్టోక్స్ ఫ్లింటాఫ్ కంటే మెరుగైన ఆల్ రౌండర్ అని ఆయన తెలియజేశారు.


ఇకపోతే బెన్ స్టోక్స్ తనలాగే ఆడుతున్నాడని తెలిపాడు. ఫ్రెడ్డీ మెరుగైన బౌలర్ అయినప్పటికీ బెన్ స్టోక్స్ తనకంటే  చాలా విషయాలలో తనకంటే ముందు నిలబడతాడు అని ఆయన వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలోనే బెన్ స్టోక్స్ ఉత్తమ ఆటగాడు అని ఆయన అభిప్రాయం తెలియజేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: