కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మొదట మంచి విజయాల ను అనుకున్నప్పటికీ ఆ తర్వాత మాత్రం పేలవ ప్రదర్శన తో తీవ్ర స్థాయి లో విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈసారైనా కేఎల్ రాహుల్ సారథ్యంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు టైటిల్ సాధిస్తుందని అభిమానులు అందరూ ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే జట్టు లో కెప్టెన్ కె.ఎల్.రాహుల్ ఓపెనర్గా బరిలోకి దిగి భారీ స్కోర్లు చేస్తూ మంచి పాత్రలు పోషించినప్పటికీ మిగతా ఆటగాళ్లు నుంచి సరైన ప్రదర్శన రాకపోవడం తో చివరికి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఓటమిని చవిచూడాల్సినా పరిస్థితి వచ్చింది..



 చివరికి మిగతా జట్లతో పోలిస్తే అతి తక్కువ విజయాల ను నమోదు చేసి పాయింట్ల పట్టిక లో అట్టడుగు చేరిపోయింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు.. ఈ క్రమం లోనే తీవ్ర స్థాయి లో విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు లో ఏకంగా 11 కోట్లకు పైగా పారితోషికం చెల్లించి ఆల్రౌండర్ మాక్స్వెల్ ను  తీసుకుంది జట్టు యాజమాన్యం. ఇక జట్టులో  అద్భుతంగా రాణించి  విజ యంలో తోడ్పాటు అందిస్తాడు అని అనుకుంది. కానీ మొదటి నుంచి మ్యాక్స్వెల్ అనుకున్నంత స్థాయిలో రాణించలేక అన్న విషయం తెలిసిందే. ఈక్రమం లోనే మ్యాక్స్వెల్ ఆట తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.



 కానీ నిన్న జరిగిన మ్యాచ్ లో మాత్రం మ్యాక్స్వెల్ అద్భుతంగా కం బ్యాక్ చేశాడు అనే చెప్పాలి. ఓవైపు బౌలింగ్ విభాగంలో కూడా అద్భుతంగా రాణించి బ్యాట్స్మెన్లను  తక్కువ పరుగులకే కట్టడి చేయడంతో పాటు బ్యాటింగ్లో కూడా మంచి ప్రదర్శన కనబరిచాడు మాక్స్ వెల్.  32 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఇన్ని రోజుల వరకు విమర్శలు ఎదుర్కొన్న మాక్స్వెల్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్లు అభిమానులు కూడా భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: