ఐపీఎల్ సీజన్లో టైటిల్ ఫేవరెట్గా రంగంలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదటినుంచి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే మొదట విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ ఐపిఎల్ సీజన్ లో తన ప్రస్థానాన్ని ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత మాత్రం వరుస పరాజయాలను సొంతం చేసుకుని విమర్శలు ఎదుర్కొంది. ముఖ్యంగా ధోనీ కెప్టెన్సీపై కూడా ఎన్నో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకపోవడంపై కూడా ఎన్నో విమర్శలు ఎదుర్కొంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.



 ప్రతి సీజన్లో ప్లే ఆప్ కి అర్హత సాధించిన జట్టు గా రికార్డు సృష్టించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ సీజన్లో మాత్రమే లీగ్ దశ నుంచి తప్పుకున్న మొదటి జట్టుగా చెత్త రికార్డు నమోదు చేసింది. అయితే మొదటి నుంచి అపజయాల పాలవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రస్తుతం వరుసగా రెండు విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓడిన గెలిచినప్పటికీ కూడా చెన్నై సూపర్ కింగ్స్ లో కీలక ఆటగాడిగా ఉన్న రవీంద్ర జడేజా ఓవైపు బౌలింగ్లో మరోవైపు ఫీలింగ్లో ఇంకోవైపు బ్యాటింగ్ లో  కూడా అద్భుత ప్రదర్శన చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎంతో ఒత్తిడిలో కూడా అద్భుతంగా రాణిస్తూ భారీగా పరుగులు రాబట్టాడు రవీంద్ర జడేజా.



 ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో రవీంద్ర జడేజా మరింత అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. 12 బంతుల్లో 30 పరుగులు కావాల్సిన సమీకరణం ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా ఎంతో అద్భుతంగా రాణించాడు. వరుసగా సిక్సర్లు ఫోర్లు కొట్టిన రవీంద్ర జడేజా ఎంతో సునాయాసంగా 30 పరుగులను సాధించాడు దీంతో అప్పటివరకు కోల్కతా నైట్రైడర్స్ చేతిలో ఉన్న మ్యాచ్ అనూహ్యంగా రవీంద్ర జడేజా క్రీజు  లోకి వచ్చి  రాణించడంతో చెన్నై విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన మహేంద్ర సింగ్ ధోనీ తమ జట్టులో డెత్ ఓవర్లలో రవీంద్ర జడేజా మాత్రమే ప్రతి మ్యాచ్ లో  బాగా రాణిస్తున్నాడు అంటూ ప్రశంసలు కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: