రికార్డుల రారాజుగా పరుగులు యంత్రంగా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. దిగ్గజ క్రికెటర్ లు సృష్టించిన ఎన్నో రికార్డులను తిరగరాశాడు విరాట్ కోహ్లీ. ఎన్నో సరికొత్త రికార్డులను నెలకొల్పేందుకు కూడా సిద్ధంగా ఉన్నాడు. అయితే సాధారణంగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు విరాట్ కోహ్లీపై ఎంతగానో ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉంటారు. ఇక ఇటీవలే మరో మాజీ క్రికెటర్ టీమిండియా డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పై ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ ప్రపంచంలోనే బెస్ట్ క్రికెటర్ అంటూ కితాబు ఇచ్చాడు సదరు మాజీ క్రికెటర్.
తాను ఇప్పుడు వరకు ఎంతోమంది క్రికెటర్లను చూశానని అయితే తాను చూసిన అందరూ క్రికెటర్లలో కెల్లా భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడు అంటూ ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు లాంగర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేవలం బ్యాటింగ్ విషయంలోనే కాదు అతని ఎనర్జీ క్రికెట్ ఆట పట్ల అతనికి ఉన్న అంకితభావం.. ఫీలింగ్ చేసే విధానం.. ఇవన్నీ కూడా తనకు ఎంతగానో నచ్చుతాయి అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక ఇటీవల తాను తండ్రి అయ్యే సమయానికి ఇండియా వెళ్లాలి అనుకోవడం కూడా ఎంతగానో నచ్చిందని చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ లాంగర్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి