ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా కంగారు జట్టుతో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు భారీగా పరుగులు చేసింది. అయితే ఒకానొక దశలో భారత బౌలర్లు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లను కట్టడి చేసినట్లు కనిపించినప్పటికీ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు  మాత్రం దూకుడుగా ఆడి భారీ స్కోరు చేశారు అన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ రోజు భారత జట్టు మొదటి ఇన్నింగ్స్ ఆరంభించింది. అయితే భారీ లక్ష్య ఛేదన ఉన్న సమయంలో టీమిండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ నిర్లక్ష్యం అయిన షాట్ ఆడి వికెట్ చేజార్చుకోవటం  అందరికీ నిరాశపరిచింది



 ఇటీవలే గాయం నుంచి కోలుకున్న రోహిత్ శర్మ అద్భుతంగా రాణిస్తాడు అని అందరూ అనుకున్నారు కానీ ఊహించని విధంగా రోహిత్ శర్మ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరడంతో టీమిండియా కష్టాల్లో పడిపోయింది అన్న విషయం తెలిసిందే.  74 బంతుల్లో 44 పరుగులు చేసి చివరికి అనవసరమైన షాట్ ఆడి అవుటయ్యాడు. అయితే రోహిత్ శర్మ ఇలా అర్థంతరంగా అనవసరమైన షాట్ ఆడి వికెట్ కోల్పోవటం పట్ల అటు అభిమానులు నెటిజన్లు కూడా తీవ్ర నిరాశతో ఉన్నారు. అయితే రోహిత్ శర్మ నిర్లక్ష్యపు షాట్ ఆడటం పై స్పందించిన భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.



 రోహిత్ శర్మ అలా ఎందుకు ఆ షాట్ ఆడాడు..? ఎవరూ ఊహించని షాట్ అది. ఇంకా చెప్పాలంటే బాధ్యతారాహిత్యమైన షాట్. ఎందుకంటే.. లాంగాన్‌లో ఫీల్డర్ ఉన్నాడు. అలానే డీప్ స్వ్కేర్‌ లెగ్‌లోనూ ఓ ఫీల్డర్‌ని ఆస్ట్రేలియా ఉంచింది. మరి అలాంటప్పుడు ఆ షాట్ ఎందుకు ఆడాడు..? పరుగుల కోసమా.. ఆ షాట్‌కి రెండు బంతుల ముందు ఒక బౌండరీని రోహిత్ శర్మ సాధించాడు. ఆ తర్వాత కూడా ఆ తాపత్రయమేలా..? రోహిత్ శర్మ ఒక సీనియర్ ఆటగాడు.. షాట్ సెలక్షన్‌పై అతనికి మినహాయింపులు ఏమీ ఉండవు. మొత్తంగా ఓ నిర్లక్ష్యపు షాట్‌తో అప్పనంగా ఆస్ట్రేలియాకి వికెట్ సమర్పించుకున్నాడు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సునీల్ గవాస్కర్.

మరింత సమాచారం తెలుసుకోండి: