ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టెస్ట్ సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. టెస్టు సిరీస్ లో  భాగంగా ఇప్పటికే మూడు మ్యాచ్ లు  ముగియగా ప్రస్తుతం నాలుగవ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ నాలుగవ టెస్ట్ మ్యాచ్ లో  విజయం సాధించిన జట్టు టెస్ట్ సిరీస్ కైవసం చేసుకుంటుంది  అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే జరిగిన టెస్ట్ సిరీస్ లలో మొదటి టెస్ట్ సిరీస్ ఆస్ట్రేలియా జట్టు గెలవగా రెండో టెస్ట్ సిరీస్ భారత జట్టు గెలిచింది. ఇక మూడవ టెస్ట్ సిరీస్ లో ఎవరు గెలిచి ఆధిపత్యం సాధిస్తారు అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసినప్పటికీ.. హోరాహోరీ పోరు మధ్య మ్యాచ్ డ్రాగా ముగిసింది అన్న విషయం తెలిసిందే.



 ఈ నేపథ్యంలోనే టెస్ట్ సిరీస్లోని చివరి టెస్ట్ మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారిపోయింది. అదే సమయంలో అటు టీమిండియాను వరుసగా గాయాల బెడద వేధిస్తూ ఉండడం మరింత క్లిష్టంగా మారిపోయింది టీమిండియా పరిస్థితి.  ఈ క్రమంలోనే అనుభవం లేని యువ ఆటగాళ్లకు జట్టులో అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఇక ప్రస్తుతం టీమిండియా నాలుగో టెస్టులో భాగంగా చివరి ఇన్నింగ్స్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత ఆటగాళ్లు ఎలా రాణిస్తారు అనేదానిపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. కాగా ఇటీవలే టెస్ట్ సిరీస్ పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.



 గాయపడ్డ టీం ఇండియాపై ఈ టెస్ట్ సిరీస్ డ్రాగా ముగిసింది అంటే ఆస్ట్రేలియా జట్టుకు రెండేళ్లనాటి ఘోర ఓటమి కన్నా దారుణమైన అవమానం అంటూ రికీ పాంటింగ్ వ్యాఖ్యానించాడు. సమయం తక్కువగా ఉండడంతో ఇక ఆఖరి టెస్టులో రహానే జట్టు విజయం కోసం పరితపిస్తుందా  లేదా మళ్లీ ఈ మ్యాచ్ కూడా డ్రాగా ముగించ డానికి ప్రయత్నిస్తూ ఉందా అన్నది చూడాలి అంటూ వ్యాఖ్యానించాడు. జట్టులో కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడినప్పటికీ టీమిండియా జట్టు ఎక్కడ వెనకడుగు వేయకుండా పట్టుదలతో పోరాటం చేసిందని కానీ ఏదో ఒక దశలో ఆగిపోవాల్సి అని వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: