ఇక ఇటీవలే సొంత గడ్డపై ఇంగ్లాండ్ జట్టు చేతిలో ఘోర ఓటమిని చవి చూడటం తో విరాట్ కోహ్లీ ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలన్న డిమాండ్లు పెరిగి పోతూనే ఉన్నాయి. అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ కంటే అజింక్యా రహానే కెప్టెన్సీలో ఆటగాళ్లు ప్రశాంతం గా కనిపిస్తున్నారని మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమం లోనే ఇటీవలే ఈ అంశంపై అజింక్యా రహానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇటీవలే మీడియా తో మాట్లాడిన అజింక్యా రహానే కు కెప్టెన్సీ మార్పు పై ప్రశ్న ఫన్నీ సమాధానం ఇచ్చాడు. ఎప్పటికీ తమ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటూ మరోసారి స్పష్టం చేశారు
అయితే పదిహేను ఇన్నింగ్స్ లో తన స్కోర్ ని ఒకసారి పరిశీలించుకోవాలి అంటూ రహానే సూచించాడు. టీమిండియా ఆటగాళ్లు కాస్త డల్ గా కనిపిస్తే అది కెప్టెన్సీ మార్పులకు కారణమే కాదు. మీరు ఈ విషయంలో మసాలా కోసం వెతుకుతున్నారా.. అయితే దురదృష్టవశాత్తు మీకు ఎలాంటి మసాలా దొరకకపోవచ్చు అంటూ అజింక్య రహానే ఫన్నీ సమాధానం ఇచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి