ఇటీవలే చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన భారత 300కు పైగా పరుగుల తేడాతో విజయం సాధించి ఇంగ్లాండ్ జట్టు పై ప్రతీకారం తీర్చుకోవడమే కాదు అటు విమర్శకుల నోళ్లు కూడా ముయించింది అన్న విషయం తెలిసిందే. జట్టులోని ప్రతి ఆటగాడు కూడా గెలుపులో కీలక పాత్ర వహించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. భారత జట్టు సమిష్టి కృషితో భారత్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇలాంటి నేపథ్యంలో అటు ఇంగ్లాండ్ క్రికెటర్లు పిచ్ సరిగ్గా లేదని అంటూ పలు రకాల విమర్శలు కూడా చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే.
ఇటీవల భారత్ సాధించిన అద్భుత విజయం పై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ పీటర్సన్ భారత జట్టును కవ్వించేలా ఒక పోస్టు పెట్టగా ఇక దీనిపై స్పందించిన భారత మాజీ ఆటగాడు అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. భారత్కు కంగ్రాట్స్.. ఇంగ్లాండ్-బి జట్టుపై గెలిచినందుకు అంటూ పీటర్సన్ ఒక పోస్ట్ పెట్టగా దీనిపై స్పందించిన వసీం జాఫర్.. పీటర్సన్ ను టోల్ చేయకండి.. ఎందుకంటే సౌత్ఆఫ్రికా ఆటగాళ్లు లేకుండా ఇంగ్లాండ్ జట్టు పూర్తి సామర్థ్యం కలిగిన జట్టుగా ఎలా అవుతుంది అంటూ కౌంటర్ ఇచ్చాడు వసీం జాఫర్. సౌత్ ఆఫ్రికాకు చెందిన పీటర్సన్ గతంలో ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి