కరోనా వైరస్ నేపథ్యంలో ఇక టోక్యో ఒలంపిక్స్ లో పాల్గొనే ఆటగాళ్లు ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం ప్రేక్షకులు లేకుండానే క్రీడా ప్రపంచం ముందుకు సాగుతుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న క్రికెట్ మ్యాచ్లు సహా వివిధ రకాల మ్యాచ్ లు కూడా ప్రేక్షకులు లేకుండా జరుగుతూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే టోక్యో ఒలంపిక్స్ లో ప్రేక్షకులను అనుమతిస్తారా లేదా అనే దానిపై ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి.
అయితే కేవలం జపానీయులు మాత్రమే అనుమతి ఇచ్చి మిగతా దేశాలకు చెందిన ప్రేక్షకులను అనుమతించే అవకాశం లేదు అని గతంలో వార్తలు వినిపించాయి. ఇక ఇప్పుడు ఇదే నిజం అయినట్లు తెలుస్తుంది. ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ కు కేవలం 50 శాతం ప్రేక్షకులను మాత్రమే అనుమతించేందుకు నిర్వాహకులు నిర్ణయించారు. అయితే టోక్యో ఒలంపిక్స్ కి విదేశీయులకు మాత్రం నో ఎంట్రీ అంటూ చెప్పేశారు. ఇక టోక్యో ఒలింపిక్స్ కు హాజరయ్యే ప్రేక్షకుల సంఖ్య పది వేల మందికి మించకూడదని ఆర్గనైజింగ్ కమిటీ కూడా నిర్ణయించింది. దీంతో టోక్యో ఒలంపిక్స్ కి వెళ్లి మన దేశం తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న వారికి మద్దతు తెలిపే అవకాశం భారత ప్రేక్షకులకు లేకుండా పోయిందని అందరూ నిరాశలో మునిగిపోయారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి