
టీమిండియా సారథి బాధ్యతలు ధోని చేతుల్లోకి వచ్చినప్పటినుంచి ఇక జట్టు ప్రదర్శన తీరు అద్భుతంగా సాగిపోయింది అయితే భారత జట్టు ఓడిపోయే పరిస్థితుల్లో ఉన్న అటు ప్రేక్షకుల్లో మాత్రం ధోని ఉన్నాడు అనే ధీమా ఉండేది. ప్రేక్షకుల అంచనాలను నిలబెడుతూ ఎప్పుడూ జట్టుకు విజయాన్ని అందిస్తూ ఉండేవాడు మహేంద్రసింగ్ ధోని. ఇక తన ఆటతోనే కాదు తన కెప్టెన్సీ తో కూడా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఎప్పటికప్పుడు వ్యూహాలకు పదును పెడుతూ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తూ ఉన్నాడు. ధోని టీమిండియాకు అందించిన విజయాలు చరిత్రలో నిలిచి పోయాయి.
అయితే సరిగ్గా ఇదే రోజు.. ధోని మరో చరిత్రకు నాంది పలికాడు. అప్పటికే 2007లో టీమిండియాకు అందని ద్రాక్షలా ఉన్న ప్రపంచకప్ అందించాడు. ఇక 2011లో కూడా మరోసారి వరల్డ్ కప్ గెలిచి మళ్లీ హిస్టరీ సృష్టించాడు . ఇక 2013లో కూడా ధోని ఒక మరిచిపోలేని రోజు అనే చెప్పాలి. ధోనీ సారథ్యంలో ఎంతో వీరోచితంగా పోరాడినా భారత జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అందుకుంది. ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టును ఓడించి ట్రోఫీ గెలుచుకుంది భారత జట్టు. ఇక ఇదే రోజు 2013లో ఇండియా గొప్ప విజయాన్ని సాధించింది అంటూ గుర్తు చేసుకుంటూ ఇటీవల బీసీసీఐ ఒక సోషల్ మీడియా లో ఒక ట్విట్ పెట్టగా వైరల్ గా మారిపోయింది.