ప్రస్తుతం భారత క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక సాదాసీదా మధ్యతరగతి యువకుడి స్థాయినుంచి ప్రపంచం గర్వించదగ్గ క్రికెటర్ స్థాయికి ఎదిగాడు మహేంద్రసింగ్ ధోని. తన కెరీర్లో ఎన్నో విజయాలను టీమిండియాకు అందించాడు. ఇక ప్రస్తుతం రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఏ ఆటగాడికి లేనంత క్రేజ్ కేవలం ధోనికి మాత్రమే సొంతం అయ్యింది అని చెప్పాలి. అయితే ధోని భారత జట్టులో స్థానం సంపాదించుకున్న సమయంలో ధోని కి మొదటి బెస్ట్ ఫ్రెండ్ గా మారిపోయాడు యువరాజ్ సింగ్.  వీరిద్దరిలో ఎవరు బాగా రాణించిన ఇంకొకరు సంబరాల్లో మునిగిపోయేవారు.



 ఇక వీరిద్దరి స్నేహం చూసి అభిమానులు అందరూ ఎంతో సంతోషపడ్డారు. కానీ వీరిద్దరి మధ్య ఒక బాలీవుడ్ హీరోయిన్ చిచ్చు పెట్టింది అని చెబుతూ ఉంటారు. అప్పట్లో ఓం శాంతి ఓం అనే సినిమా లో హీరోయిన్ గా నటించింది దీపిక పదుకొనే. తన అందాలతో తన ఓర చూపులతో ధోనిని ఆకర్షించింది. ఇక అప్పటి నుంచి ధోనీ దీపికా పదుకొనే కలిసి పార్టీలకు వెళ్లడం ఎక్కడంటే అక్కడ కలిసి కనిపించడం కూడా జరిగింది.  దీంతో వీరిద్దరూ డేటింగ్ లో  ఉన్నారు అని ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే అప్పట్లో లాంగ్ హెయిర్ తో అందరిని ఆకర్షించిన ధోని ఆ తర్వాత షార్ట్ హెయిర్ చేసుకోవడానికి దీపికా పదుకొనే కారణం అని చెబుతూ ఉంటారు.



 కానీ ఆ తర్వాత ఏమైందో ఇక ధోని కి దీపికా పదుకొనే కి బ్రేకప్ అయిపోయింది. ఎందుకంటే ఇక తన ప్రాణ స్నేహితుడైన యువరాజ్ కూడా దీపికా పదుకొనేనే ప్రేమించడంతో అప్పట్లో తన ప్రేయసిని ఏకంగా స్నేహితడి కోసం ధోని త్యాగం చేశాడు అనే వార్తలు కూడా వచ్చాయి  కొన్నాళ్ల పాటు దీపికా పదుకొనే అటు యువరాజ్ సింగ్ తో పార్టీలకు పబ్బులకు వెళ్ళిన ఫోటోలు కూడా హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఇక అంతే కాదు ప్రాణ స్నేహితులు కాస్త  శత్రువులు గా మారిపోయారు అని అప్పట్లో ఎన్నో వార్తలు హల్ చల్ చేశాయి . ఇకపోతే దీపికా పదుకునెతో ధోని రిలేషన్ లో ఉన్న సమయంలో ఫామ్ కోల్పోయి ఎంతగానో ఇబ్బంది పడ్డాడు. మళ్ళీ ఫామ్ లోకి వచ్చి జట్టు కెప్టెన్ అయిన తర్వాత  ఇక దీపికా తో యువరాజ్ సింగ్ డేటింగ్ లో ఉన్న కారణంగా యువరాజ్ ను జట్టులోకి తీసుకోలేదు అనే వార్తలు కూడా వచ్చాయి  అంతేకాదు ఒకప్పుడు ప్రాణస్నేహితులు గా ఉన్న ఇద్దరు ఒకరి పెళ్ళికి ఒకరిని కనీసం పిలుచుకోవడం కూడా చేయలేదు . ఇలా ధోని కెరియర్ లో దీపిక ఒక చేదు అనుభవంగా మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: