అయితే ఇక అవని తన జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్లు కష్టాలు తెలిస్తే ప్రస్తుతం అందరి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. జీవితం మొత్తం సాఫీగా సాగిపోతుంది. అలాంటి సమయంలోనే అనుకోని ఘటన. పదేళ్ల వయస్సు ఉన్నప్పుడే కారు ప్రమాదం జరిగింది. ఆ దేవుడు ఆ అమ్మాయిని చిన్నచూపు చూశాడు. చివరికి కారు ప్రమాదంలో అవని వెన్నుముక్క విరిగిపోయింది. దీంతో అప్పటి నుంచి వీల్ చైర్ కి పరిమితం అయింది. ఇక నీ జీవితం ముగిసిపోయింది. ఇక నువ్వు ఏమి చేయలేవు అంటూ ప్రపంచం మొత్తం ఆమెను వెక్కిరిస్తూ ఉంటే ఆమె ఎంతగానో కుంగిపోయింది .
కానీ ఆ బాధలో నుంచే కసి పుట్టింది.. వెక్కిరిస్తున్న వారి నోళ్ళు ముయించాలి అని అనుకుంది. నేనేం చేయగలను అని ఆలోచించడం మొదలు పెట్టింది. ఆ సమయంలోనే తల్లిదండ్రుల నుంచి సహకారం అందింది. అప్పుడే తండ్రి ఒక సూచన చేశాడు. ఆర్చరీ, షూటింగ్ నేర్చుకోవాలి అంటూ చెప్పాడు. ఇక తండ్రి చెప్పిన సలహాని తూచా తప్పకుండా పాటించింది. ఇక అప్పటి నుంచి ట్రైనింగ్ ప్రారంభించింది. ట్రైనింగ్ మొదలుపెట్టిన ఏడాదికి నేషనల్ ఛాంపియన్షిప్ లో మూడు మెడల్స్ సాధించి తన సత్తా చాటింది. మూడు మెడల్స్ సాధించినప్పటికీ కూడా ఆమెకు సొంత రైఫిల్ లేదు కోచ్ కూడా లేడు కేవలం ఆత్మ విశ్వాసం ఒక్కటే ఉంది. ఇక అదే ఆత్మ విశ్వాసం తో పోరాడి ఇక ఇప్పుడు ఏకంగా భారత్ గోల్డ్ మెడల్ గెలిచి పెట్టి ఇక విశ్వ వేదికపై త్రివర్ణ పతాకం గర్వంగా రెపరెపలాడేలా చేసింది అవని.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి