ఇటీవలే ప్రారంభమైన ఐపీఎల్ రెండో దశలో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే రోజురోజుకు ఐపీఎల్ పోరు ఎంతో రసవత్తరంగా మారిపోతుంది. ప్లే ఆప్ కి అర్హత సాధించడానికి అన్ని జట్లు కూడా ఎంతో హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే ఈసారి టైటిల్ విజేతగా ఎవరు నిలవ బోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. గత రెండు సీజన్లలో కూడా డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్ టైటిల్ ను ఎగరేసుకుపోయింది. ఇప్పటివరకు ఎక్కువసార్లు గెలిచిన జట్టు గా కూడా ముంబై ఇండియన్స్ కొనసాగుతోంది.



 ఈ క్రమంలోనే ఇక ఈసారి టైటిల్ విజేత ఎవరు నిలవ బోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఐపీఎల్ లో మూడు సార్లు టైటిల్ విజేత గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం దూసుకుపోతుంది. వరుస విజయాలు సాధిస్తూ ఇప్పటికే ఐపీఎల్ సీజన్ లో మొదట ప్లేఆఫ్ క్వాలిఫై అయిన మొదటి జట్టు గా రికార్డు సృష్టించింది చెన్నై సూపర్ కింగ్స్.  అంతేకాదు పాయింట్స్ టేబుల్ లో కూడా టాప్ లో కొనసాగుతోంది. గత సీజన్ లతో పోల్చి చూస్తే అటు ముంబై ఇండియన్స్ జట్టు మాత్రం ఆ దూకుడు ని కొనసాగించ లేక పోతుంది.  ఇక పాయింట్స్ టేబుల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత  ఢిల్లీ కాపిటల్ జట్టు ఉంది.



 ఇకపోతే ఈ సారి టైటిల్ విజేతగా ఏ జట్టు నిలుస్తుంది అన్న దానిపై సర్వత్రా కంట నెలకొనగా.. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముంబై ఇండియన్స్ టాప్4 లో కూడా నిలవదు అంటూ వ్యాఖ్యానించాడు. ఇప్పటి వరకు టైటిల్ గెలవని టీమ్ ప్లే ఆఫ్ కి వెళ్లి టైటిల్ కొట్టాలి అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడూ. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్ జట్లలో ఏది గెలిచిన పర్వాలేదు కానీ ముంబై ఇండియన్స్ మాత్రం అసలు గెలవద్దు అంటూ వ్యాఖ్యానించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ మిగతా మ్యాచ్లను గెలవాల్సి ఉంది. అది అంత సులువు కాదు.. కానీ హిస్టరీ చూసుకుంటే వారికి ఇది సులువే అంటూ చెప్పుకొచ్చాడూ వీరేంద్ర సెహ్వాగ్ ..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl