అయితే ఇప్పటికే ప్లే ఆఫ్ కి అర్హత సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది నామమాత్రపు మ్యాచ్ అయినప్పటికీ అది పంజాబ్ కి మాత్రం ప్లే ఆఫ్ లో చేరేందుకు కీలకమైన మ్యాచ్ గా మారింది. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు ఘన విజయం సాధించింది. అలవోకగా చెన్నై సూపర్ కింగ్స్ తమ ముందు ఉంచిన టార్గెట్ చేధించింది. అయితే మొన్నటి వరకు వరుస విజయాలతో దూసుకుపోయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పుడు వరుసగా ఓటమి పాలు అవుతూ ఉండటం గమనార్హం. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచులో ఓటమిపాలైన చెన్నై ఈరోజు కూడా పంజాబ్ చేతిలో ఓటమి పాలైంది.
అయితే నేడు పంజాబ్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో అటు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అదరగొట్టాడు అని చెప్పాలి. ఏకంగా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు అలవోకగా విజయాన్ని అందించడంలో సక్సెస్ అయ్యాడు. ఒకరకంగా చెప్పాలి అంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బౌలర్లు అందరికీ కూడా కె.ఎల్.రాహుల్ చుక్కలు చూపించాడు . మైదానంలోకి వచ్చినప్పటినుంచి సిక్సుల వర్షం కురిపించాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఇచ్చిన 135 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13 ఓవర్లలోనే పంజాబ్ జట్టు ఛేదించింది. ఇక ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కె.ఎల్.రాహుల్ 43 బంతులలో 98 పరుగులు చేసి జస్ట్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.ఇక ఇందులో 8 సిక్సర్లు 7 ఫోర్లు ఉండటం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి