నాలుగేళ్ల త‌ర్వాత పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ అయిన టీ 20 ప్ర‌పంచ క‌ప్ జ‌రుగు తుండ‌డంతో కోట్లాది మంది క్రికెట్ అభిమానుల తో పాటు మ‌న దేశంలో ఉన్న క్రికెట్ అభిమానులు కూడా మ‌న‌కు క‌ప్ వ‌స్తుంద‌ని.. ఈ పొట్టి క‌ప్ మ‌న‌దే అని ఎన్నో ఆశ‌ల తో పాటు ఊహ‌ల్లో మునిగి తేలారు. అయితే పొట్టి ప్ర‌పంచ క‌ప్ లో రెండు మ్యాచ్ లు ఆడిన భార‌త్‌.. రెండు మ్యాచ్ ల్లోనూ చిత్తు గా ఓడిపోవ‌డంతో వారి ఆశ‌లు అడి యాస‌లు అయిపోయాయి. దీనికి తోడు భార‌త్ సెమీస్ అవ‌కాశాలు కూడా సంక్లిష్టం చేసుకుంది. సెమీస్ కు వెళ్లాలంటే భార‌త్ ఖ‌చ్చితంగా గెల‌వాల్సిన న్యూజిలాండ్ మ్యాచ్ లో కూడా చిత్తు గా ఓడిపోయింది.

పేరుకు మాత్రమే ఇది ప్ర‌పంచ క‌ప్ లో తేలికైనా గ్రూప్ గా మారింది. అస‌లు ఈ గ్రూప్ లో న‌మీబియా - స్కాట్లాండ్ - అప్ఘ‌నిస్తాన్ - పాకిస్తాన్ - న్యూజిలాండ్ ల‌తో భారత్ కు మ్యాచ్ లు ఉన్నాయ‌న గానే స‌గ‌టు భార‌త క్రికెట్ అభిమాని ఈ గ్రూప్ టాపర్ భార‌త జ‌ట్టే అని మురిసి పోయారు. మ‌నం మంచి నీళ్లు తా గి నంత సులువుగా సెమీస్ కు వెళ్లి పోతామ‌ని లెక్క‌లు వేసుకున్నారు. అయితే ఇప్పుడు మ‌న జ‌ట్టు సెమీస్ కు వెళ్ల‌డం దాదాపు క‌ష్ట‌మే అని తేలిపోయింది.

ఏదైనా సంచ‌ల‌నాలు జ‌ర‌గాలంటే న్యూజిలాండ్ జ‌ట్టు తాను ఆడే మూడు చిన్న జ‌ట్ల తో ( న‌మీబియా, స్కాట్లాండ్, అప్థ‌నిస్తాన్ ) క‌నీసం రెండు మ్యాచ్ ల్లో ఓడిపోవాల్సి ఉంటుంది. క‌నీసం ఒక్క మ్యాచ్ లో ఓడిపోయినా కూడా మెరుగు అయిన ర‌న్ రేట్ ఉన్న న్యూజిలాండ్ జ‌ట్టే సెమీస్‌కు వెళుతుంది. భార‌త్ పాక్‌, న్యూజిలాండ్ చేతిలో చిత్తు గా ఓడిపోవ‌డంతో ర‌న్ రేట్ కూడా లేకుండా పోయింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: