ఎట్ట‌కేల‌కు టి20 ప్రపంచకప్‌ 2021లో టీమిండియా అఫ్గానిస్తాన్‌పై ఘ‌న విజ‌యం తో తొలి విజ‌యం త‌న ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్ లో ఘ‌న విజ‌యంతో టీం ఇండియా ర‌న్ రేట్ మైన‌స్ నుంచి ప్ల‌స్‌ల‌కు వ‌చ్చేసింది. అయితే ఓవ‌రాల్ ర‌న్ రేట్ చూస్తే ఇండియా ఇప్ప‌ట‌కీ న్యూజిలాండ్‌, అఫ్గానిస్తాన్‌ల కంటే వెనుకబడి ఉంది. టీమిండియాకు సెమీస్‌ చేరడం కష్టమే అయినా కూడా ఆశ‌లు ఉన్నాయి. ప్ర‌స్తుతానికి గ్రూఫ్‌-1 నుంచి ఇంగ్లండ్‌, గ్రూఫ్‌-2 పాకిస్తాన్‌ సెమీస్‌కు వెళ్లాయి. ఇక గ్రూఫ్ 2 లో చూస్తే ఆప్ఘాన్ పై గెలిచిన టీం ఇండియా  +0.073 రన్‌రేట్‌తో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. ఈ గ్రూప్‌లో చూస్తే న్యూజిలాండ్‌ రన్‌రేట్‌ +.0.816 ఉంది. ఇక ఆప్ఘాన్ రన్‌రేట్‌ +3.097 నుంచి +1.481 కు పడిపోయింది.

అయితే ఇప్పుడు ఇండియా సెమీస్‌కు వెళ్లాలంటే ముందు గా స్కాట్లాండ్‌, నమీబియాలతో జరగనున్న మ్యాచ్‌ల్లో భారీ విజ‌యం సాధించాలి. ఇక అఫ్గానిస్తాన్‌ లేదా నమీబియాతో జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఓడిపోవాలి. అది జ‌ర‌గ‌క పోవ‌చ్చు.. అయితే న్యూజిలాండ్ పై అఫ్గానిస్తాన్‌ గెలిస్తే మాత్రం టీమిండియాకు అవకాశాలు ఉండొచ్చు. ఇవేవి జ‌ర‌గ కుండా న్యూజిలాండ్ అఫ్గాన్ - నమీబియాపై గెలిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా సెమీస్‌కు వెళుతుంది. అప్పుడు టీమిండియా, అఫ్గానిస్తాన్‌లు ఇంటికి వ‌చ్చేస్తాయి.

అలాగే సెమీస్ కు వెళ్లేందుకు న్యూజిలాండ్ , టీం ఇండి యాతో పాటు ఆప్ఘాన్ కు కూడా అవ‌కాశాలు ఉన్నాయి. అది ఎలా అంటే న్యూజిలాండ్‌ అఫ్గానిస్తాన్‌తో ఓడి.. నమీబియాతో గెలిస్తే ఆ జ‌ట్టుకు 6 పాయింట్లు ఉంటాయి. ఇండియా రెండు మ్యాచ్ లు గెలిస్తే 6 పాయింట్లు ఉంటాయి. అప్పుడు ఆప్ఘాన్ కు కూడా 6 పాయింట్లే ఉంటాయి. అప్పుడు మూడు జ‌ట్ల మ‌ధ్య నెట్ ర‌న్ రేట్ కీల‌క మ‌వుతుంది. అప్పుడు ఎవ‌రు సెమీస్‌కు వెళ‌తారు ? అనేది నెట్ ర‌న్ రేట్ నిర్ణ‌యిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: