ఇదిలా ఉంటే ఎన్నో రంగాల్లో సెంటిమెంట్లు ఉన్నట్టే క్రికెట్లో కూడా కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. ఈ సారీ టీ 20 ప్రపంచ కప్ ను ఆస్ట్రేలియా గెలుచుకున్న వెంటనే కొందరు ఓ కొత్త సెంటిమెంట్ ను బయటకు తీశారు. ఐసీసీ టోర్నీలో ఫైనల్స్ కు చేరుకున్న రెండు జట్ల కెప్టెన్ లు ట్రోఫీని పట్టుకొని ఫోటో లో మనకు కనిపిస్తారు. అయితే ఆ ఫొటో లో ట్రోఫీకి ఎడమ వైపు ఏ కెప్టెన్ అయితే ఉంటారో ఆ జట్టు ఓడిపోవడం కామన్ అయిపోయింది. 2016 నుంచి కూడా ఇదే సెంటిమెంట్ రిపీట్ అవుతూ వస్తోంది.
2016 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో ట్రోఫీకి ఎడమ వైపు మోర్గాన్ ఉన్నాడు. ఆ టోర్నీ లో ఆ జట్టు ఓడిపోయింది. అలాగే 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో ట్రోఫీకి ఎడమ ఉన్న కోహ్లీ జట్టు ఉంటే భారత్ ఓడిపోయింది. అలాగే 2019 ప్రపంచ కప్ లో ట్రోఫీకి ఎడమ వైపు ఉన్న కేన్ విలియమ్స్‌న్ ఉన్నాడు. ఆ జట్టు కూడా తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగిన ఫైనల్స్ లో ఓడిపోయింది.
ఇక 2021 లో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో మళ్ళీ ట్రోఫీకి ఎడమ వైపు కేన్ విలియమ్సన్ ఉన్నాడు. ఆ జట్టు కూడా ఫైనల్స్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. మరి ఈ సెంటిమెంట్ ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందో ? చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి