బీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలయింది అంటే చాలు క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎంత ఉర్రూతలూగి పోతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ప్రతి ఏడాది వచ్చే ఐపీఎల్ ఇక అంతకు ముందు ఎప్పుడూ లేనివిధంగా సరికొత్తగా ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉంటుంది. అయితే ఐపీఎల్ చూడటానికి కేవలం భారత క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతగానో ఆసక్తి చూపుతారు అని చెప్పాలి. అదేసమయంలో విదేశీ ఆటగాళ్లు సైతం ఐపీఎల్లో ఆడటానికి ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉంటారు.



 అయితే ఇటీవలే ఐపిఎల్ 2021 సీజన్ ముగిసింది. ఇక పోతే ఇక 2022 ఐపీఎల్ సీజన్ కోసం బీసీసీఐ ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉండటం గమనార్హం. అదే సమయంలో 2022 ఐపీఎల్ సీజన్ లో కొత్తగా రెండు జట్లు ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే  బిసిసిఐ ఐపీఎల్ కోసం మేగా వేల నిర్వహించబోతోంది. దీంతో ఏ ఆటగాడు ఏ జట్టులోకి వెళ్ళిపోతున్నాడు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022  షెడ్యూల్ ఖరారు అయినట్లు తెలుస్తోంది.


 అయితే ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తగ్గడంతో యూఏఈ వేదికగా కాకుండా ఎప్పటిలా భారత్ వేదికగానే ఐపీఎల్ నిర్వహించాలని బిసిసిఐ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇక 2022 ఐపీఎల్ సీజన్ భారత్ వేదికగా జరగబోతుంది. దీంతోఐపీఎల్ 2022 మ్యాచ్ చెపాక్ స్టేడియం వేదికగా ఏప్రిల్ 2, 2022న ప్రారంభం కాబోతోందని టాక్ వినిపిస్తోంది. 60 రోజులపాటు ఈ టోర్నీ జరగబోతుంది. ఇక 10 జట్లు 74 మ్యాచ్ ఆడబోతున్నాయట. ఐపీఎల్ ఫైనల్ జూన్ 4వ తేదీన లేదా 5వ తేదీన జరగబోతుందట. టోర్ని ఓపెనింగ్ మ్యాచ్  లో ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగబోతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl