సాధారణంగా మ్యాచ్ జరుగుతున్నప్పుడు ప్రతి ఆటగాడిలో కూడా ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది  ఒత్తిడిని జయించి బాగా రాణించడానికి ప్రతి ఆటగాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.  కేవలం మైదానంలో క్రికెట్ ఆడే ఆటగాళ్లలో మాత్రమే కాదు అంపైర్ల లో కూడా ఒత్తిడి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇలా అంపైర్లు ఒత్తిడితో కొన్ని కొన్ని సార్లు ఇచ్చే నిర్ణయాలు ఏకంగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తూ ఉంటారూ. అయితే గత కొంత కాలం నుంచి అంపైర్లు తప్పుడు నిర్ణయాల కారణంగా ఎన్నో సార్లు విమర్శలు ఎదుర్కొన్న ఘటనలు కూడా ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో చాలానే వెలుగులోకి వచ్చాయి.



 ఇక ఇప్పుడు మరో సారి అంపైర్లు తీసుకున్న తప్పుడు నిర్ణయం కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రస్తుతం న్యూజిలాండ్ భారత్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక న్యూజిలాండ్ భారత్ మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది దీంతో రెండవ టెస్ట్ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేదానిపై ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే రెండవ టెస్ట్ మ్యాచ్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఆడుతూ ఉండటం గమనార్హం.  ఇక రెండవ టెస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ భారీగా పరుగులు చేస్తాడు అని అందరూ భావించారు. కానీ సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితం అయిన విరాట్ కోహ్లీ ఎల్బిడబ్ల్యు రూపంలో పెవిలియన్ చేరాడు.



 అయితే న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఎల్బిడబ్ల్యు రూపంలో వికెట్ కోల్పోవడం  వివాదాస్పదంగా మారి పోయింది. న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ పటేల్ బౌలింగ్లో కోహ్లీ ఎల్బీడబ్ల్యూ అవుట్ అంటూ అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ అవుట్ గా ప్రకటించాడు. దీంతో ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్న కెప్టెన్ కోహ్లి డిఆర్ఎస్ కోరాడు. అందులో బంతి మొదట బ్యాట్ కి తగిలింది అని స్పష్టం గా కనిపించింది. కానీ థర్డ్  అంపైర్ మాత్రం ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ అవుట్ గా ప్రకటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: