ప్రపంచ వ్యాప్తంగా స్పోర్ట్స్ కి ఉన్న ఆదరణ తెలిసిందే. అందులో బ్యాడ్మింటన్ కు కూడా ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడున్న మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారుల్లో సైనా నెహ్వాల్ మరియు పివి సింధులు దేశానికి ఎంతో ఖ్యాతిని తెచ్చారు.  అయితే ప్రస్తుతం సైనా నెహ్వాల్ తో పోల్చుకుంటే సింధు మాత్రమే మంచి ఫామ్ లో ఉంది. ఈ సంవత్సరం జపాన్ లో జరిగిన ఒలింపిక్ గేమ్స్  లోనూ సింధు కాంస్య పతకం సాధించింది. అయితే ఆ తర్వాత జరిగిన ఏ టోర్నీ లోనూ కనీసం ఫైనల్ చేరలేక  పోయింది. ప్రస్తుతం ఇండోనేషియాలోని బాలి లో జరుగుతున్న వరల్డ్ టూర్ ఫైనల్స్ కు చేరుకుంది. ఈ దశల్లో సెమీఫైనల్ లో జపాన్ కు చెందిన తన చిరకాల ప్రత్యర్థి యమగూచిని నిర్ణయాత్మక మూడవ సెట్ లో ఓడించి ఫైనల్ కు చేరుకుంది.

దాదాపు ఈ సంవత్సరంలో జరిగిన నాలుగు టోర్నీల్లో ఫైనల్ చేరిన మొదటి టోర్నీ ఇదే కావడం విశేషం. ఇప్పుడు అందరి చూపు ఈ రోజు జరగబోయే ఫైనల్స్ మీదనే ఉంది. ఈ మ్యాచ్ లో తెలుగు తేజం పీవీ సింధు దక్షిణాఫ్రికాకు చెందిన అన్ సెయింగ్ తో టైటిల్ కోసం పోటీ పడనుంది. అయితే సింధు కు ఈ క్రీడాకారిణితో మంచి రికార్డు లేదు. గతంలో సింధు తనతో తల పడిన రెండు మ్యాచ్ లలోనూ పరాజయం పాలయింది. వీరిద్దరి మధ్య జరగనున్న మూడవ మ్యాచ్ ఇది, కాబట్టి ఖచ్చితంగా అన్ సేయింగ్  ఫేవరేట్ అని చెప్పాలి. కానీ సంచలనాలకు మారు పేరైన పీవీ సింధు ను తక్కువ అంచనా వేయలేం.

ఈ సంవత్సరం ఒలింపిక్ గేమ్స్ తర్వాత ఒక్క టోర్నీని గెలవకపోవడంతో  సింధు ఎలాగైనా ఈ ఫైనల్ లో విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఏమి జరగనుంది అనేది తెలియాలంటే ఇంకాస్త సమయం వరకు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: